మరో అరుదైన రికార్డు అందుకున్న ప్రభాస్ చిత్రాలు..!!

గోల్డెన్ గ్లోబ్ ప్రఖ్యాత అంతర్జాతీయ చలనచిత్ర అవార్డులను సైతం ప్రకటించడం జరిగింది. అయితే ఇందులో డైరెక్టర్ రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన RRR సినిమాకి నాటు నాటు పాటకు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా అందుకున్నారు.. తాజాగా ఈ గోల్డెన్ గ్లోబు సంస్థ తన పోర్టల్ లో తెలుగు సినిమాలను గురించి ఒక ప్రత్యేక కథంశాన్ని తెలియజేయడం జరిగింది. ఇందులో తెలుగు సినిమా రంగం టాలెంట్ గురించి సూపర్ డూపర్ హిట్టు కొట్టిన పలు చిత్రాల గురించి చర్చించారు.

Saaho VS Baahubali VS Baahubali 2 Box Office: 4-Day Business Comparison Of  These Prabhas Starrers
ఇందులో అద్భుతమైన చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ప్రభంజనాన్ని సృష్టించిన సినిమాలు గురించి తెలియజేయడం జరిగింది. అయితే అనుకోకుండా ఈ జాబితాలో మూడు సినిమాలు కలిగి ఉన్న ఏకైక హీరో ప్రభాస్ మాత్రమే అని చెప్పవచ్చు. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో పాటు సుజిత్ దర్శకత్వంలో వచ్చిన సాహో సినిమాలో కూడా ఉన్నది.ఈ మూడు సినిమాలు గోల్డెన్ గ్లోబ్ లిస్టులో స్థానం సంపాదించుకోవడంతో ప్రభాస్ అభిమానులు తెగ ఖుషి అవుతున్నారు. తాము అభిమానించే హీరో చిత్రాల వల్లే తెలుగు సినిమా ఈ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకుందని తెలియజేస్తున్నారు.

అలాగే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన పలు చిత్రాలు కూడా గోల్డెన్ గ్లోబ్ లిస్టులో అవకాశాలు దక్కించుకున్నాయి. ముఖ్యంగా బాహుబలి, బాహుబలి-2,RRR చిత్రాలతో మంచి పేరు సంపాదించారు. ప్రభాస్ తో పాటు రాజమౌళి వల్ల కూడా తెలుగు సినీ రంగం టాలెంట్ గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటూ ఉన్నారు. దీంతో ప్రభాస్ ,రాజమౌళి పైన గోల్డెన్ గ్లోబ్ సంస్థ ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.

Share post:

Latest