పవన్ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోబోతున్న అడవి శేష్.. జూన్ 16న మోగనున్న పెళ్లి బాజాలు!

సినీ రంగంలో ఉన్న వారి గురించి ఏ వార్త అయినా సోషల్ మీడియాలో చాలా వేగంగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా వారి మధ్య ప్రేమలు, గొడవలు, ఎఫైర్లు, పెళ్లికి సంబంధించిన విషయాలు, కొత్త సినిమాలు, వారి వైఫల్యాలు ఇలా చాలా విషయాలు ప్రేక్షకులు ఉత్కంఠను పంచుతాయి. వారిలో సరికొత్త ఆసక్తిని పెంపొందిస్తాయి. ఇక ఇటీవల కాలంలో పాన్ ఇండియా హీరోగా మారిన అడవి శేష్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. కొన్నాళ్లుగా తాను ప్రేమిస్తున్న మహిళను ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆమె ఎవరో కాదండోయ్.. పవన్ హీరోగా నటించి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో నటించిన సుప్రియ. కొన్నాళ్లుగా సుప్రియతో అడవి శేష్ చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నాడు. వారి ఇంట్లో జరిగే వేడుకలు, ఫంక్షన్లకు హాజరవుతున్నాడు.

సుప్రియతో పెళ్లికి అడవి శేష్ ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. ఈ కారణం వల్లనే వారి పెళ్లి వాయిదా పడిందని తెలుస్తోంది. ఎట్టకేలకు అడవి శేష్ ఇంట్లో వీరి పెళ్లికి ఆమోదం లభించింది. దీంతో జూన్ 16న వీరు ఒక్కటి కానున్నారని ప్రచారం సాగుతోంది. ఇక సుప్రియ ఎవరో కాదు. నాగార్జునకు మేనకోడలు అవుతుంది. హీరో సుమంత్‌కు సోదరి అవుతుంది. ఇక అడవి శేష్- సుప్రియల పెళ్లికి అక్కినేని నాగచైతన్య పెళ్లి పెద్దగా వ్యవహరించినట్లు సమాచారం. ఇటీవల కాలంలో రామ్ చరణ్‌ బర్త్ డే ఫంక్షన్‌కు అడవి శేష్‌తో కలిసి వచ్చింది.


అప్పుడే వీరిద్దరి మధ్య ఏదో ఉందనే గుసగుసలు వచ్చాయి. చివరికి అదే నిజం అయింది. వయసు రీత్యా అడవి శేష్ కంటే సుప్రియ పెద్ద అవుతుంది. అయినప్పటికీ ఇదేమీ వారి పెళ్లికి, ప్రేమకు అడ్డంకి కాలేదు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం కుటుంబ సభ్యులు, పెద్దల సమక్షంలో జూన్ 16న వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగనున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే సినిమా రంగంలో మరో జంట ప్రేమ పెళ్లి చేసుకున్న వారి జాబితాలో చేరనుంది.

Share post:

Latest