రికార్డు ధ‌రకు అమ్ముడుపోయిన‌ `బ్రో` ఓటీటీ రైట్స్‌.. స‌గం బ‌డ్జెట్ వ‌చ్చేసిందట‌!?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, ఆయ‌న మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న మెగా మ‌ల్టీస్టార‌ర్ `బ్రో`. తమిళంలో సముద్రఖని నటించడంతో పాటు దర్శకత్వం వహించిన `వినోదయ సీతం`కు రీమేక్ ఇది. కోలీవుడ్ లో డైరెక్ట్ చేసిన స‌ముద్ర‌ఖ‌నినే తెలుగులోనూ ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు తీసుకున్నారు.

త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ డైలాగ్స్ అందిస్తుంటే.. త‌మ‌న్ స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ దాదాపు ఆఖ‌రి ద‌శ‌కు చేరుకుంది. మ‌రో ప‌ది రోజుల్లో మొత్తం షూటింగ్ కంప్లీట్ అవుతుంది. జూలై 28న ఈ చిత్రాన్ని అట్ట‌హాసంగా విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేసుకున్నారు. తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈ మూవీ టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది.

 

ఇక‌పోతే ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెర‌పైకి వ‌చ్చింది. తాజాగా `బ్రో` ఓటీటీ డీల్ క్లోజ్ అయింద‌ట‌. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కులు రికార్డు ధ‌ర‌కు అమ్ముడు పోయిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌ముఖ దిగ్గ‌జ ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్ బ్రో డిజిట‌ల్ రైట్స్ ను ఏకంగా రూ. 40 కోట్లకు సొంతం చేసుకోన్న‌ట్లు చెబుతున్నారు. ఇది నిజంగా రికార్డు ధ‌రే అని చెప్పాలి. అంతేకాదు, సినిమా బ‌డ్జెట్ తో స‌గం డిజిట‌ల్స్ రైట్స్ రూపంలోనే వ‌చ్చేసింద‌ని అంటున్నారు. ఇక థియేట‌ర్‌లో రిలీజైన నాలుగు వారాల నుంచి ఆరు వారాల గ్యాప్‌లో ఓటీటీలో బ్రో సంద‌డి చేయ‌నుంది.

Share post:

Latest