20 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న పవన్ కళ్యాణ్ సోదరి..!!

టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో పవన్ కళ్యాణ్ చెల్లెలి పాత్రలో తమిళ నటి వాసుకి నటించింది.. ఈ సినిమాతో నాటిక మంచి పేరు సంపాదించిన ఈమె బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ బాగా పాపులారిటీ సంపాదించింది. ఈమె పవన్ స్నేహితుడు ఆనంద్ సాయిని వివాహం చేసుకోవడంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. కానీ ఆ తర్వాత నటిగ మాత్రం కొనసాగలేదు.

దాదాపుగా రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ఈమె మంచిశకునుములే అనే చిత్రంతో రీ యంట్రి ఇవ్వబోతోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది .ఈ సందర్భంగా వాసుకి సినిమాలు చేయకపోవడానికి గల కారణాలను తెలియజేసింది. వాసుకి మాట్లాడుతూ.. తొలిప్రేమ సినిమా తర్వాత అవకాశాలు వచ్చాయి కానీ వాటిని చేయడానికి కుదరలేదు..నేను మల్టీ టాస్క్ టాపర్ ని కాదు అన్ని పనులు ఒకేసారి చేయలేని కుటుంబం పిల్లలతో ఇన్నాళ్లు తీరిక సమయం దొరకలేదు. పిల్లలు ఇప్పుడు విదేశాలలో చదువుకుంటున్నారు. తన భర్త కూడా బిజినెస్ లో బిజీగా ఉండడం వల్ల తనకు ఏదైనా చేయాలనిపించింది అందుకే యాక్టింగ్ వైపుకు వచ్చారని తెలిపింది.

ఈ చిత్రంలో తమ్ముడికి అండగా ఉండే సోదరి పాత్రలో నటిస్తున్నాను కథ బాగా నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నానని తెలుపుతోంది. తన భర్త ఆనంద్ వల్ల ఇంట్లో రోజు సినిమా చర్చలు జరుగుతూనే ఉంటుంది.నటిగానే కాకుండా దీన్ని కూడా సీరియస్ గా తీసుకోను ఏ పాత్ర చేసిన అందులో తన మార్పు ఉండేలా చూసుకుంటానని తెలుపుతోంది. అలాగే తమిళంలో కూడా పలు సినిమాలలో నటిస్తున్నానని తెలుపుతోంది.

Share post:

Latest