భార్యతో వస్తున్న రూమర్లకు చెక్ పెట్టిన పూరి జగన్నాథ్..!!

ఎ ఇండస్ట్రీలో నైనా కొంతమంది హీరోలకే కాకుండా డైరెక్టర్లకు కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అలా తెలుగు ఇండస్ట్రీలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ కూడా ఒకరు.. బద్రి సినిమాతో తన కెరీర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత ఎన్నో బ్లాక్బస్టర్ విజయాలను ఎంతోమంది హీరోలను స్టార్లుగా చేశారు. ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్న పూరి జగన్నాథ్ గత కొద్ది రోజుల నుంచి సరైన సక్సెస్ లేక సతమతమవుతున్నారు. చాలాకాలంగా సరైన హిట్టు కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు పూరి.

చివరిగా హీరో రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత ఎన్నో అంచనాల మధ్య విడుదలైన లైగర్ సినిమా ఘోరమైన డిజాస్టర్ ని చవిచూసింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగలడంతో పూరి కెరీర్ పైన తీవ్రమైన ప్రభావం చూపించింది ఆ తర్వాత మరే ప్రాజెక్టు ను కూడా ప్రకటించలేదు.. పూరి జగన్నాథ్ సినిమాల పరంగే కాకుండా వ్యక్తిగత విషయాల్లో కూడా ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటారు.

Image
గతంలో తన భార్యనుండి విడిపోయారంట వార్తలు వినిపించాయి అయితే వాటిపై పూర్తిగా పూరి కొడుకు ఆకాష్ క్లారిటీ ఇచ్చారు.. పూరి జగన్నాథ్ ముంబై లో ఉంటున్నారని హైదరాబాద్ రావడంలేదని భార్య పిల్లలకు దూరంగా ఉంటున్నారని వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే చోర్ బజార్ ఫ్రీ రిలీజ్ వేడుకలలో బండ్ల గణేష్ చేసిన కామెంట్లు సైతం అందరికీ అనుమానాలు తెప్పించేలా చేశాయి. చాలాకాలం తర్వాత పూరి తన భార్య పిల్లలతో కలిసి ఒక ఫోటోని ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

పూరి జగన్నాథ్ 30వ పెళ్లిరోజు జరుపుకుంటున్నట్లుగా తెలియజేశారు ఆ సమయంలో తన సొంత ఊరు నర్సీపట్నంలో తన అన్నదమ్ములతో కలిసి తన భార్య పిల్లలతో ఉన్నటువంటి ఫోటోని షేర్ చేశారు. దీంతో వీరిద్దరూ విడిపోయారు అన్న వార్తలకు చెక్ పడిందని చెప్పవచ్చు.

Share post:

Latest