నందమూరి అభిమానులకు ఒక్క గుడ్ న్యూస్..ఒక్క బ్యాడ్ న్యూస్.. పాపం ఎలా తట్టుకుంటారో ఏమో..?

ఎస్ .. ఇది నిజంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే నందమూరి అభిమానులకు ఒకటి గుడ్ న్యూస్ ఒకటి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి . నందమూరి నటసింహముగా పేరు సంపాదించుకున్న బాలకృష్ణ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తున్నాడు అన్న న్యూస్ తెలిసినప్పటి నుంచి నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు మోక్షజ్ఞ అని తెరపై హీరోగా చూద్దామా..? అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఇదిగో ఎంట్రీ అదిగో ఎంట్రీ అంటూ ఊరిస్తున్నారు .. తప్పిస్తే ఎక్కడ అఫీషియల్ ప్రకటన అయితే ఇచ్చింది లేదు .

కానీ రీసెంట్ గా సోషల్ మీడియాలో మోక్షజ్ఞ తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా తన ఫస్ట్ డెబ్యూ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇవ్వబోతున్నారు అంటూ ఓ న్యూస్ వైరల్ అయ్యింది. కాగా రీసెంట్గా ఆ ఆలోచన నుంచి విరమించుకున్నట్లు తెలుస్తుంది . మోక్షజ్ఞ జాతకం ప్రకారం ఆయన వచ్చే సంవత్సరం ఎంట్రీ ఇస్తేనే బాగుంటుంది అంటూ బాలకృష్ణకు జ్యోతిష్య పండితులు చెప్పుకొచ్చారట. ఈ క్రమంలోనే బాలయ్య – బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో మోక్షజ్ఞ ఎంట్రీని క్యాన్సిల్ చేశాడు బాలయ్య అంటూ తెలుస్తుంది .

ఆ తర్వాత జనవరిలో బాలయ్య కొడుకు మోక్షజ్ఞ డైరెక్ట్ గా పాన్ ఇండియా లెవల్ అప్డేట్ అఫీషియల్ గా రాబోతుందట. ప్రెసెంట్ మోక్షజ్ఞ నటన పరంగా ఇంకా ఎక్కువ నేర్చుకోవడానికి ట్రైనింగ్ తీసుకుంటున్నారట . అంతేకాదు కంటి చూపుతోనే నటించే సత్తా ఉన్న హీరోగా పేరు సంపాదించుకోవడానికి మోక్షజ్ఞ ఇప్పటినుంచే కష్టపడుతున్నారట . ఏది ఏమైనా మొదటి సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో డెబ్యూ అంటే అభిమానులు సంబరపడుతున్న ..బాలయ్య సినిమాతో డెబ్యు ఇచ్చే ఛాన్స్ మిస్ అయ్యాడు అని బాధపడుతున్నారు . చూద్దాం మరి దీనిపై బాలయ్య ఏ విధంగా స్పందిస్తారో..?