ప్రేమిస్తే లొంగిపోయే అమ్మాయిని కాదంటూ దీప్తి సునైనా సంచలన వ్యాఖ్యలు..

దీప్తి సునైనా సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రజలకు పరిచయం అయింది ఈ ముద్దు గుమ్మ. ఆ తరువాత బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా అవకాశం దక్కించుకుంది. బిగ్ బాస్ షోతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇదంతా ఒక ఎత్తయితే షణ్ముఖ్ జశ్వంత్‌తో ప్రేమాయణం మరోఎత్తు. షణ్ముఖ్ కూడా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు పరిచయమై బీబీ హౌజ్‌లోకి కంటెస్టెంట్‌గా వెళ్లాడు. షణ్ణు తన తోటి కంటెస్టెంట్ అయిన సిరితో క్లోజ్ గా ఉంటున్నాడు అని హౌస్ లో నుండి బయటికి రాగానే షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పి విడిపోయింది ఈ అమ్మడు. ఆ తరువాత వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు వచ్చాయి.

దీప్తి సునైనా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంటుంది. అంతేకాకుండా సెక్సీ దుస్తులలో కుర్రాళ్లను కవ్వించేలా ఫోటోలకు ఫోజులు ఇస్తుంది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్రపట్టనివ్వకుండా చేస్తూ, అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్య అయితే దీప్తి అందాల ఆరాబోత బాగా ఎక్కువైందనే చెప్పాలి.

ఇది ఇలా ఉండగా తాజాగా దీప్తి సునైనా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఆ ఫొటోలలో దీప్తి చాక్లెట్ కలర్ మోడ్రెన్ డ్రెస్ ధరించింది. ఆ డ్రెస్ లో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ‘ప్రేమిస్తే అంత సులభంగా పడిపోయే అమ్మాయిని కాదు’ అంటూ క్యాప్షన్ పెట్టింది. దీప్తి షేర్ చేసిన ఫోటోలను చాలామంది లైక్ చేస్తూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది దీప్తిని పోర్న్ స్టార్స్ తో పోలుస్తూ, పోర్న్ స్టార్ లా తయారవుతుంది అంటూ అసభ్యకరంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇలా దీప్తి షేర్ చేసిన ఫొటోస్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.