ఫారిన్‌లో ఎంజాయ్ చేస్తున్న జూ.ఎన్టీఆర్ కుమారులు.. పిక్స్ వైరల్..

ఎన్టీఆర్ కుమారులు అభయ్, భార్గవ్ రీసెంట్‌గా ఒక వెకేషన్ ఎంజాయ్ చేశారు. కాగా ఈ హాలిడే ట్రిప్‌లో వారు కలిసి గడిపిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జూ.ఎన్టీఆర్ విదేశాల్లో తన కుటుంబ సభ్యులతో కలిసి మే 20న పుట్టినరోజు జరుపుకున్నారు. కొన్ని రోజుల తర్వాత, అతను తన తాత సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించడానికి తిరిగి స్వదేశానికి వచ్చాడు. ఆపై ఈ యంగ్ టైగర్ ఒక గుర్తు తెలియని ప్రదేశానికి విహారయాత్రకు వెళ్లాడు.

ఆ వెకేషన్‌లో కూడా, ఎన్టీఆర్ జిమ్‌లో వర్కవుట్ చేస్తూ కనిపించాడు. అప్‌కమింగ్ మూవీ దేవరలో తన పాత్ర కోసం ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రిపేర్ అవుతున్నాడు. విదేశాలకు వెళ్లిన ఇదే పని కోసం ఈ హీరో ఉండటం అతడి అంకిత భావాన్ని చెప్పకనే చెబుతోంది. ఈ వర్కౌట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. ఇంతలో, అతని కుమారులు అభయ్ రామ్, భార్గవ రామ్ వారి సెలవులను ఆస్వాదిస్తున్న క్యూట్ స్నాప్‌షాట్‌లు ఫ్యాన్స్ హృదయాలను దోచుకున్నాయి. ఈ ఫొటోలలో వారు ఒకరినొకరు కౌగిలించుకుంటూ కనిపించారు.

కెరీర్ లైఫ్ విషయానికొస్తే, ఎన్టీఆర్ ఇటీవల రాజమౌళి దర్శకత్వం వహించిన RRRలో తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం, అతను దేవర అనే కొత్త ప్రాజెక్ట్‌లో పని చేస్తున్నాడు. ఫస్ట్ టైమ్ ఈ టాలెంటెడ్ హీరో జాన్వీ కపూర్‌తో కలిసి నటించనున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించనున్నారు. ఈ సినిమా కాక ఎన్టీఆర్ కూడా KGF దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో మరో చిత్రానికి సైన్ చేశాడు.