మంచు ల‌క్ష్మిని దారుణంగా మోసం చేసిన అనుష్క‌.. కోట్ల‌లో న‌ష్టం!

మోహన్ బాబు ముద్దుల కుమార్తె, ప్రముఖ నటి, యాంక‌ర్‌, నిర్మాత‌ మంచు లక్ష్మి ని సౌత్‌ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి దారుణంగా మోసం చేసిందట. ఆమె మోసం కారణంగా కోట్లలో నష్టం వాటిల్లిందట. మంచు లక్ష్మి ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది.

మంచు లక్ష్మి ఓవైపు నటిగా అడపా త‌డ‌పా సినిమాలు చేస్తూనే.. మరోవైపు యాంకర్ గా సత్తా చాటుతోంది. బుల్లితెరపైనే కాకుండా ఓటీటీల వేదికగా పలు షోలకు పోస్ట్ గా వ్యవహరిస్తూ అభిమానుల‌ను అలరిస్తోంది. అయితే మంచు లక్ష్మి గతంలో తను హోస్ట్ గా వ్యహరించిన ఓ టాక్ షోకు అనుష్క శెట్టిని గెస్ట్ గా రావాలని అడిగిందట.

అందుకు ఆమె వెంట‌నే ఓకే చెప్పిందట. దాంతో నిర్మాతలు అనుష్క శెట్టి ఎపిసోడ్ ను గ్రాండ్ గా ప్లాన్ చేశార‌ట‌. దాదాపు మూడు కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాట్లు చేశార‌ట‌. కానీ అనుష్క ఆఖరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చిందట. తన సినిమా షూటింగ్ సడన్ గా ప్లాన్ చేయడంతో షోకు రాలేన‌ని చెప్పి పెద్ద షాకిచ్చింద‌ట‌. దాంతో ఆమె కోసం చేసిన ఏర్పాట్లు మొత్తం వృధా అయ్యాయట. దాదాపు మూడు కోట్లు నష్టం వచ్చిందని మంచి లక్ష్మి వెల్లడించింది.

Share post:

Latest