Bangla Ganesh:రాజకీయాలపై సంచలన ట్విట్ చేసిన బండ్ల గణేష్..!!

నటుడు నిర్మాత బండ్ల గణేష్ గురించి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. బండ్ల గణేష్ ట్విట్టర్ లో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటు పలు అంశాల పైన సినిమాల పైన పోస్టులు చేస్తూ ఉంటారు. గతంలో రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ లోకి చేరి కొన్ని రోజులు హడావిడి చేసిన ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకున్న కొన్ని కారణాల చేత రాజకీయాలకు కూడా దూరంగా ఉన్నారు బండ్ల గణేష్. గతంలో రాజకీయాలలోకి రానని ప్రకటించడం జరిగింది. కానీ తాజాగా బండ్ల గణేష్ చేసిన ట్వీట్స్ చాలా వైరల్ గా మారుతున్నాయి.

bandla ganesh announced political entry | Vaartha

బండ్ల గణేష్ తన ట్విట్టర్లో నా రాజకీయ భవిష్యత్తుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని నీతిగా నిజాయితీగా నిబద్ధతగా ధైర్యంగా పౌరుషంగా పొగరుగా రాజకీయాలు చేస్తా బానిసత్వానికి భై భై నిజాయితీతో కూడిన రాజకీయాలకు జై జై అంటే ట్విట్లు చేశారు. రాజకీయాలంటే పౌరుషం రాజకీయాలంటే శ్రమ రాజకీయాలంటే పోరాటం ఇవన్నీ ఉంటేనే రాజకీయాల్లోకి చేరాలి రావాలి అందుకే వస్తానంటూ ట్వీట్ చేశారు. ఒకపక్క కర్ణాటక ఫలితాలు ఉన్న సమయంలో బండ్ల గణేష్ ఇలా ట్విట్ చేయడం పెను సంచలనంగా మారింది.

https://twitter.com/ganeshbandla/status/1657058212343078912?s=20

మరి కాంగ్రెస్ లోకి బండ్ల గణేష్ వస్తాడా అని అనుకుంటున్నారు కానీ అతను పెట్టిన ట్విట్లను బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని కాబట్టి.. జనసేనలోకి వచ్చే అవకాశం ఉందని కామెంట్లు చేస్తున్నారు.. తెలంగాణలో 2023 ఎలక్షన్లు ఉండడంతో మరి ఈసారి ఏ పార్టీలో బండ్ల గణేష్ చేరుతారనే విషయంపై ఇంకా సందీప్దంగా ఉన్నది. ప్రస్తుతం ఈ ట్వీట్లు పెను సంచలనాలను సృష్టిస్తున్నాయి.

https://twitter.com/ganeshbandla/status/1657057464335101953?s=20

https://twitter.com/ganeshbandla/status/1657060184056012800?s=20