ఆ వైసీపీ నేతలకు పవన్‌తోనే నష్టం..అందుకే టార్గెట్.!

ఎప్పుడో రాక రాక ఏపీలో అడుగుపెడతారు. ఇక ఆయన అడుగు పెట్టడమే ఆలస్యం వైసీపీ నేతలు మీడియా సమావేశాలతో రెడీగా ఉంటారు. ఆయన టార్గెట్ గా ఓ రేంజ్ లో విమర్శలు చేయడం, తిట్టడం చేస్తారు. పైగా ఇప్పుడు పవన్..టి‌డి‌పితో పొత్తు ఖచ్చితంగా ఉంటుందని చెప్పేశారు. దీంతో వైసీపీ నేతలు మరింత ఎటాకింగ్ మొదలుపెట్టారు. పవన్‌ని ఓ రేంజ్ లో టార్గెట్ చేసి ముందుకెళుతున్నారు. అభిమానులని, కాపులని పవన్ తాకట్టు పెడుతున్నారని విమర్శలు చేస్తున్నారు.

అయితే వారి విమర్శలు ఎలా ఉన్నా..పవన్‌ని టార్గెట్ చేసే నేతలకు పవన్ తోనే రిస్క్ ఉంది. ఎందుకంటే ఆయన టి‌డి‌పితో గాని పొత్తు పెట్టుకుంటే ఆ నేతలకే ఎదురుదెబ్బలు తప్పవు. తాజాగా పవన్‌ని టార్గెట్ చేస్తూ పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇలా కొందరు నేతలు టార్గెట్ చేసి మాట్లాడారు. ఇక వీరంతా గత ఎన్నికల్లో జనసేన ఓట్లు చీల్చడం వల్లే గెలిచారు. దాని వల్ల టి‌డి‌పికి నష్టం జరిగింది..వైసీపీకి లాభం జరిగింది.

ఉదాహరణకు మచిలీపట్నంలో పేర్ని నాని..టి‌డి‌పి అభ్యర్ధి కొల్లు రవీంద్రపై 6 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అక్కడ జనసేనకు 18 వేల ఓట్ల వరకు పడ్డాయి. అంటే అప్పుడు టి‌డి‌పి-జనసేన కలిస్తే పేర్ని గెలిచే వారు కాదు. ఇక పెడనలో జోగి రమేష్..టి‌డి‌పి అభ్యర్ధి కాగిత కృష్ణప్రసాద్ పై 7 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అక్కడ జనసేన 25 వేల ఓట్లు పడ్డాయి. అంటే టి‌డి‌పి-జనసేన కలిస్తే జోగి గెలిచే వారు కాదు. అంబటి, అమర్నాథ్ పరిస్తితి కూడా అంతే. నెక్స్ట్ ఎన్నికల్లో పొత్తు ఉంటే వీరు గెలవడం కష్టం..అందుకే పవన్‌ని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు.