గర్భం దాల్చిన హీరోయిన్.. అతడి ట్వీట్ వైరల్

బాలీవుడ్‌లో ప్రేమ జంటలు నిత్యం వార్తల్లో ఉంటారు. వారికి సంబంధించిన చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంటుంది. ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరూ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. అయినప్పటికీ పలుమార్లు డిన్నర్ డేట్‌కు వెళ్తూ, ఇతర కార్యక్రమాల్లో కలిసి కనిపిస్తూ తమ మధ్య బంధాన్ని కన్‌ఫర్మ్ చేశారు. ఇద్దరూ తరచుగా విమానాశ్రయంలో, కొన్నిసార్లు రెస్టారెంట్ వెలుపల కనిపించారు.

ఆ తర్వాత వీరి పెళ్లి వార్త కూడా హెడ్‌లైన్స్‌లో హల్‌చల్ చేస్తోంది. అతి త్వరలో పరిణీతి, రాఘవ్ ల రోకా జరగబోతోందని అంతా అనుకుంటున్నారు. మరికొన్ని రోజుల్లో వీరి నిశ్చితార్థం జరగనుందని సన్నిహితులు పేర్కొంటున్నారు. దీంతో పలువురు రాజకీయ, సినిమా ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ తరుణంలో ఓ పుకారు అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. వివాదాస్పద ట్వీట్లు చేసే ఉమైర్ సంధు ఈ సంచలనానికి కారణమయ్యాడు.

ఉమైర్ సంధు ఇటీవల చేసిన ట్వీట్ ప్రకంపనలు రేపుతోంది. పరిణీతి చోప్రా గర్భం దాల్చిందని అందులో పేర్కొన్నాడు. అందుకే రాఘవ్ చద్దాతో ఆమె పెళ్లి త్వరగా జరుగుతోందని పేర్కొన్నాడు. ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియదు. అయితే ఉమైర్ సంధు ఈ విషయాలను బహిరంగంగా పేర్కొనడం సంచలనాలకు కారణమైంది. ఆయన గతంలోనూ పలువురు హీరోయిన్లు, హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఉమైర్ సంధుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేం తీరు అని ప్రశ్నిస్తున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా ఇలా వార్తల్లో ఉంటున్నాడని, అతడు ఏ ఆధారాలతో ఆమెపై ఈ ఆరోపణలు చేస్తున్నాడని నెటిజన్లు నిలదీస్తున్నారు. ఏదేమైనా ఇలాంటి చవకబారు వ్యాఖ్యల వల్ల వారి క్రేజ్ ఏ మాత్రం తగ్గదని కొందరు నెటిజన్లు పరిణీతి చోప్రాకు మద్దతుగా నిలుస్తున్నారు.

Share post:

Latest