ఒళ్ళు మండే ప్ర‌శ్న వేసిన రిపోర్ట‌ర్‌.. చెంప చెల్లుమ‌నేలా స‌మాధానం ఇచ్చిన అలియా భ‌ట్‌!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భ‌ట్ గ‌త ఏడాది త‌న ప్రియస‌ఖుడు ర‌ణ‌బీర్ క‌పూర్ తో ఏడ‌డుగులు వేసిన సంగ‌తి తెలిసిందే. పెళ్లి అయిన ఏడు నెల‌ల‌కే ఈ దంప‌తుల‌కు పండంటి ఆడ బిడ్డ జ‌న్మించింది. దీంతో పెళ్లికి ముందే అలియా భ‌ట్ గ‌ర్భం దాల్చింద‌ని తేలిపోయింది. ప్రెగ్నెన్సీ కార‌ణంగా న‌ట‌న‌కు బ్రేక్ ఇచ్చిన అలియా భ‌ట్‌.. ప్ర‌స్తుతం ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది.

అయితే తాజాగా అలియా భ‌ట్ ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది. అక్క‌డ రిపోర్ట‌ర్ `కెరీర్ లో మంచి అవకాశాలు అందుకుంటున్న టైమ్ లో తల్లి కావాలని ఎందుకు అనిపించింది..?` అంటూ ఒళ్ళు మండే ప్ర‌శ్న వేశాడు. దాంతో అలియా భ‌ట్ చెంప చెల్లుమ‌నేలా స‌మాధానం ఇచ్చింది. `ఈ ప్రశ్న మీరు హీరోల్ని ఎందుకు అడగరు. ఇలాంటి వాటిని హీరోయిన్లనే ఎందుకు అడుగుతారు.

నేను కెరీర్ మొదలైన పదేళ్లకు పిల్లల్ని కన్నాను. ఈ విషయంలో చాలా ఆనందంగా ఉన్నాను. చేసే ఏ పని అయిన మనసుకు నచ్చితేనే చేస్తాను. నాకు నచ్చకూండా ఏ పని చేయను. నాకు నచ్చక వదులుకున్న పెద్ద సినిమాలు ఎన్నో ఉన్నాయి. ద‌యచేసి ఇలాంటి చెత్త ప్రశ్నలు మళ్లీ న‌న్ను అడ‌గ‌కండి` అంటూ ఘాటుగా బ‌దులిచ్చింది. దీంతో అలియా భ‌ట్ కామెంట్స్ నెట్టింట వైర‌ల్ గా మారాయి.

Share post:

Latest