ఆ కారణంగానే ఎన్టీఆర్ గ్లోబల్ హీరోగా మారాడా.. ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు..!

ఒక మనిషి ఎంత కష్టపడితే ఆ కష్టానికి తగిన ఫలితం వస్తుందని ఎప్పటి నుంచో మన పెద్దలు చెబుతున్న మాట.. ఈ కష్టపడే తత్వమే నందమూరి కుటుంబం నుంచి మూడోతరం హీరోగా వచ్చిన ఎన్టీఆర్ లో కూడా ఉంది. ఎన్టీఆర్ ను గ్లోబల్ స్టార్ గా చేసింది కూడా ఆతత్వమే అనే చెప్పవచ్చు. చిన్నతనం నుంచి ఎన్టీఆర్ తాను తన తాత లాగా కావాలని అనుకునేవారు.. అంత పెద్ద కుటుంబం ఉన్నప్పటికీ ఎన్టీఆర్ ఈ స్థాయిలో నిలవడానికి ఆయన ఎంతో శ్రమ పడ్డారు.

Jr NTR Upcoming Movies 2023 & 2024 with Release Date, Budget, Trailer & More - JanBharat Times

బరువు విషయంలో ఎన్నో సార్లు విమర్శలు ఎదుర్కొన్నారు.. అదే సమయంలో యమదొంగ సినిమాతో బరువు తగ్గి అందరికీ షాక్ ఇచ్చాడు. తనను అవమానించిన వారికే తన ఏంటో చూపించాడు. ఆ సినిమా దగ్గరనుంచి ఎన్టీఆర్ ప్రస్తుతం తన సినిమాలకు అనుగుణంగా బరువు పెరగడం తగ్గడం చేస్తున్నాడు. ప్రధానంగా ఎన్టీఆర్ ఈ స్థాయిలో సక్సెస్ కావటం వెనక తారక్ తల్లి కృషి ఎంతో ఉంది.

A sneak-peek into Jr NTR's lavish lifestyle: Most expensive things owned by the 'Naatu Naatu' actor | The Financial Express

ఎన్టీఆర్‌కు చిన్నతనంలోనే కూచిపూడి నృత్యంలో ఎంతో గొప్ప ప్రావీణ్యత ఉంది. అదేవిధంగా ఇప్పటికీ ఎన్టీఆర్‌ను డాన్స్ విషయంలో నెంబర్ వన్ హీరోగా నే చెప్పుకుంటూ వస్తున్నారు. ఎన్టీఆర్ టాలెంట్ తో కెరీర్ పరంగా అంతకంతకు ఎదుగుతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో తన 30వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అదేవిధంగా తన పుట్టినరోజుకు మరో ఏడు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ పుట్టినరోజుకి తన అభిమానులకి ఎవరూ ఊహించని షాకింగ్ అప్డేట్స్ కూడా ఇవ్వబోతున్నారని తెలుస్తుంది.

Koratala Siva to focus on Jr NTR's look in NTR30 | 123telugu.com

ఇక మరి ఎన్టీఆర్- కొరటాల ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ రిపీట్ చేస్తారో చూడాలి. ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ విషయంలో కూడా భారీ రేంజ్‌లో అందుకుంటున్నాడు. తారక్ మాస్ సినిమాల కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండగా ఆ సినిమాల్లో కూడా హై వోల్టేజ్ యాక్షన్ ఉండేలా చూసుకుంటున్నాడు. తన కెరీర్ విషయంలో రాంగ్ వేలో వెళ్లకుండా కెరీర్‌ను ప్లాన్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌కు మరిన్ని విజయాలు దక్కాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.

Share post:

Latest