`ఖుషి` క్లైమాక్స్ అలా ఉండ‌బోతుందా.. విజ‌య్‌-సామ్ ఫ్యాన్స్ జీర్ణించుకోగ‌ల‌రా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, సౌత్ స్టార్ సమంత జంటగా నటిస్తున్న తాజా చిత్రం `ఖుషి`. క‌శ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో అందమైన ప్రేమ కథగా రూపొందుతోన్న ఈ సినిమాకు శివ నిర్వాణ‌ దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యాన‌ర్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ హై బ‌డ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇందులో జ‌య‌రామ్‌, సచిన్ ఖేడేకర్, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. ఈ రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్ సెప్టెంబ‌ర్ 1న విడుద‌ల కానుంద‌ని ఇప్ప‌టికే మేక‌ర్స్ ఆఫీషియ‌ల్ గా అనౌన్స్ చేశారు. దాదాపు ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయింది. విజ‌య్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఈ మూవీ నుంచి మేక‌ర్స్ విడుద‌ల చేసిన‌ ఫ‌స్ట్ సింగిల్ కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట వైర‌ల్ గా మారింది.

అదేంటంటే ఈ మూవీని మొత్తం ఫ్లాష్ బ్యాక్ స్టోరీతోనే నడిపిస్తారట‌. అయితే క్లైమాక్స్ లో హీరో హీరోయిన్లలో ఒక పాత్ర చనిపోతుందట‌. `చావు ఎప్పుడు వస్తుందో తెలియదు.. ఉన్నంత కాలం ప్రతి ఒక్కరూ ఖుషిగా బ్రతకాలి` అనే సందేశంతో ఈ సినిమాముగిస్తారని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఒక‌వేళ నిజంగానే ఖుషి క్లైమాక్స్ లో ఇటువంటి శాడ్ ఎండింగ్ ఉంటే.. దానిని విజ‌య్‌, సామ్ ఫ్యాన్స్ జీర్ణించుకోగ‌ల‌రా అన్న‌ది సందేహంగా మారింది.

Share post:

Latest