ప్రేమతో హీరోయిన్ ని ముద్దు అడిగిన అభిమాని.. నిజంగానే ఇచ్చేసిందిరోయ్.. లక్కి ఫేలో బాసూ..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి నెటిజన్స్ స్టార్ హీరోస్ హీరోయిన్స్ ని ఎలాంటి రకాల ప్రశ్నలు అడుగుతున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు హీరో దగ్గరికి వెళ్లి మాట్లాడాలంటే భయపడేవారు ఇప్పుడు పూర్తిగా ట్రెండ్ మారిపోయింది . స్టార్స్ నెటిజన్స్ కి భయపడుతున్నారు. ఎప్పుడు..? ఎలా..? ఏం ప్రశ్నలు అడుగుతారో.. ఏం ప్రశ్నిస్తారో అంటూ భయపడిపోతున్నారు. రీసెంట్ గా మాళవిక మోహన్ కి అదే పరిస్ధితి ఎదురైంది.

ఆమె అభిమాని డైరెక్ట్ గా ” ముద్దు కావాలి” అంటూ అడిగేసాడు . అంతేనా ఆ అమ్మడు కూడా ” ముద్దు ఇవ్వడం” ఇప్పుడు షాకింగ్ గా అనిపిస్తుంది. ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో యమ ట్రెండింగ్ దూసుకెళ్తుంది. మనకు తెలిసిందే సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన “పేట” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ మాళవిక మోహన్ .. ఆ తర్వాత దళపతి విజయ్ హీరోగా నటించిన మాస్టర్ సినిమాతో హ్యూజ్ సక్సెస్ అందుకుంది .

ఆ తర్వాత తెలుగులో ఏ సినిమా చేయకపోయినా.. డబ్బింగ్ ఓటిటి సినిమాలతో తన పేరును పాపులారిటీ సంపాదించుకున్న మాళవిక ..హాట్ హాట్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాని చెక్ చేస్తూ ఉంటుంది. కాగా సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే మాళవిక రీసెంట్గా ట్వీట్టర్ ద్వారా ఆస్క్ మాళవిక అంటూ కండక్ట్ చేసింది. ఈ క్రమంలోనే ” నాకు ముద్దు ఇస్తారా” అంటూ ఓపెన్ గా అడిగాడు ఓ అభిమాని. అయితే మాళవిక మోహనన్ కూడా స్పందిస్తూ “ఇది మీ డిపి లోని ఎంత అందంగా ఉన్న పిల్లి కోసం ” అంటూ ముద్దు సింబల్ ను ఎమోజిగా పెట్టింది ..జనాలు షాక్ అయిపోయారు . జనరల్ గా ఇలాంటివి అడిగితే ఎవరైనా సరే ఫైర్ అవుతారు . కానీ మాళవిక మోహనన్ చాలా కూల్ గా ఆన్సర్ ఇవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!

 

Share post:

Latest