అబ్బబ్బా.. లక్కంటే శ్రీలీలదే.. ఏం ఛాన్స్ కొట్టేసింది రా బాబు.. చంద్రబాబు కూడా ఫిదా..!!

ఎస్.. ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వెబ్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. అందాల ముద్దుగుమ్మ కన్నడ బ్యూటీ తెలుగు ఇండస్ట్రీలో ఫుల్ స్వింగ్ మీద ఉందా..? అంటే అవుననే చెప్పాల్సి వస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ బిజీ బిజీ గా ఉన్న హీరోయిన్స్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది శ్రీలీల. ఇప్పుడు ఆమె చేతిలో ఏకంగా 12 సినిమాలు పెట్టుకుని ఇండస్ట్రీలో క్రేజీ రికార్డును నెలకొల్పుతుంది . ఎంట్రీ ఇచ్చిన సెకండ్ సినిమాకి రెండు కోట్ల పారితోషికం అందుకొని షాక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రెసెంట్ మహేష్ బాబు – బాలకృష్ణ – పవన్ కళ్యాణ్ లాంటి బడా హీరోలతో కూడా నటిస్తుంది .

రీసెంట్గా సినిమాల పరంగానే కాదు పర్సనల్ విషయాలు కారణంగా కూడా శ్రీలీలను ఎక్కువగా లైక్ చేస్తున్నారు అభిమానులు . ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఇన్సిడెంట్ తో లక్ అంటే శ్రీలీలదే అంటూ మరోసారి సోషల్ మీడియాలో ఆమెను ట్రెండ్ చేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు హైదరాబాదులో ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే . ఈ ఈవెంట్ కి చంద్రబాబు నాయుడు – బాలకృష్ణ టాలీవుడ్ స్టార్ హీరోస్ పలువురు ప్రముఖులు.. రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు .

అయితే ఇలాంటి క్రమంలోన్ర ఈ జనరేషన్ కి సంబంధించిన హీరోయిన్స్ ఎవరు కూడా ఆ వేదికపై కనిపించలేదు . ఎక్సెప్ట్ శ్రీ లీలా తప్పిస్తే.. మిగతా ఎవ్వరు ఈవెంట్ కి రాలేదు. శ్రీల ఒక్కదానికే ఈ వేడుకకు ఇన్విటేషన్ అందింది అంటూ సమాచారం అందుతుంది . ఈ క్రమంలోని స్టేజి పైకి బాలయ్య ఆమెను స్వయంగా తీసుకొచ్చి చంద్రబాబుకు పరిచయం చేయడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . అంతేకాదు శ్రీ లీల చంద్రబాబును చూడగానే నమస్కరించడంతో ఆయన ఫిదా అయిపోయారట. ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఎవరైనా చూడగానే హాయ్ అంటూ హగ్ చేసుకుంటున్నారు. కానీ శ్రీలీల పూర్తి భిన్నంగా ప్రవర్తించింది పెద్దవారికి నమస్కారం చేస్తూ చాలా రెస్పెక్ట్ ఫుల్ గా మాట్లాడింది. ఈ క్రమంలోనే శ్రీలీల మర్యాదలకు బిహేవియర్ కు చంద్రబాబునాయుడు కూడా ఫిదా అయిపోయాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ప్రెసెంట్ ఆ వేడుకల్లో శ్రీలీల ఫోటోలు తెగ వైరల్ గా మారాయి..!!