మహేశ్-త్రివిక్రమ్ సినిమా టైటిల్ వచ్చేసిందోచ్.. ఘాటెక్కించే నికాసైన “గుంటూరు కారం”..చంపేశావ్ రా మహేశా(వీడియో) ..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా ఎస్ ఎస్ ఎం బి 28 . మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ని కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు మేకర్స్ . నేడు మహేష్ బాబు నాన్నగారు కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన “మోసగాళ్లకు మోసగాడు” అనే సినిమాను రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా థియేటర్స్ లో ఫస్ట్ ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ని.. గ్లింప్స్ ని తో రిలీజ్ చేశారు మేకర్స్. మాటల మాత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఫస్ట్ టైం తన సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తూ .. ఈ సినిమాకి ఘాటైన మాస్ మసాలా గుంటూరు కారం అనే టైటిల్ ని పెట్టుకొచ్చారు. అంతేకాదు ఈ సినిమాలో రిలీజ్ అయిన గ్లింప్స్ ఆధారంగా మహేష్ బాబు ఈ సినిమాలో టూ మాస్ బోల్డ్ బుక్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది .

అంతే కాదు మహేష్ బాబు నోటి నుండి వచ్చిన “ఏంట్రా అబ్బాయి అట్లా చూస్తున్నావు ..బీడీ కూడా 3ద్ లో కనిపిస్తుందా ..?” అంటూ చెప్పే డైలాగ్ సినిమాకి హైలైట్ గా మారబోతుంది అంటూ తెలుస్తుంది . మరి ముఖ్యంగా రెడ్ షర్ట్ లో గుంటూరు కారం లాగా ఘాటెక్కించే లుక్స్ లో మహేష్ బాబు కుర్రాళ్లను అట్రాక్ట్ చేస్తున్నారు. దీంతో గుంటూరు కారం సినిమా టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!