పెళ్లయి విడాకులు తీసుకున్న హీరోతో సంయుక్త మీనన్ అఫైర్.. ఎవరంటే..

రీసెంట్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్స్‌లో సంయుక్త మీనన్ కూడా ఒకరు. ఈ తార అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. ‘భీమ్లా నాయక్ ‘ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సంయుక్త మీనన్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోని దర్శక నిర్మాతలు పాలిట గొప్ప పరంగా మారింది. భీమ్లా నాయక్ నుంచి ఇటీవల ఆమె నటించిన విరుపాక్ష సినిమా వరకు సంయుక్త నటించిన అన్ని సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యాయి.

దాంతో ఈ అమ్మను అందరూ గోల్డెన్ లెగ్గ్ అనే అంటున్నారు. సంయుక్త ఏ సినిమాలో ఉంటే ఆ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. రీసెంట్‌గా సంయుక్త నెగటివ్ రోల్‌లో అద్భుతంగా నటించిన విరుపాక్ష సినిమాతో టాలీవుడ్ లోని హీరోలు, దర్శకుల దృష్టి మొత్తం ఈ అమ్మడు పైనే ఉంది. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలలో సంయుక్త హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చిందని సమాచారం. ఇక కొన్నేళ్ల వరకు ఈ అమ్మడు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా క్రేజ్ పెరుగుతున్న కొద్ది సోషల్ మీడియా లో సంయుక్త పై రూమర్లు కూడా పెరుగుతున్నాయి.

అసలు విషయం ఏంటంటే రీసెంట్ గా విడాకులు తీసుకున్న తమిళ హీరోతో సంయుక్త మీనన్ ప్రేమాయణం నడిపిస్తుందని, అంతేకాకుండా అతనితో డేటింగ్ కూడా చేస్తుంది అంటూ పుకార్లు పుట్టుకొస్తున్నాయి. ఆ తమిళ హీరో మరెవరో కాదు రీసెంట్ గా ‘సార్ ‘అనే సినిమాలో హీరో గా నటించిన ధనుష్. ఈ సినిమాతో ధనుష్ , సంయుక్తల పరిచయం ప్రేమగా మారింది అంటూ వార్తలు వస్తున్నాయి. వీరు ప్రేమలో ఉండటమే కాదు డేటింగ్ కూడా చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. మరి రూమర్స్ పై సంయుక్త మీనన్ లేదా ధనుష్ ఎవరో ఒకరు స్పందిస్తే కానీ క్లారిటీ అనేది వస్తుంది.