“అలా ఎందుకు చేశానో ..నాకే తెలియడం లేదు”..ఇంట్రెస్టింగ్ విషయాని షేర్ చేసిన మీరా జాస్మిన్..!!

సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు సినీ ఇండస్ట్రీని ఏలేసిన అందాల ముద్దుగుమ్మలు .. ఆ తర్వాత పెళ్లి చేసుకొని ఫెడవుట్ అయిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి . మళ్లీ ఆ హీరోయిన్స్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి ఇండస్ట్రీలో మళ్ళీ తమ పేరును ట్రెండ్ చేసుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ అలా ట్రై చేసి సూపర్ సక్సెస్ అయ్యారు . తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోతుంది మీరాజాస్మిన్ .

సినీ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఎంతటి క్రేజీ స్థానాన్ని సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . చూడడానికి చబ్బీగా బొద్దుగా ఉన్నా సరే మీరాజాస్మిన్ అంద చందాలతో కుర్రాళ్లను తెగ ఆకట్టుకుంది . హోంలీ లుక్స్ లో మెరిసిన మీరాజాస్మిన్ ..ఆ తర్వాత పెళ్లి చేసుకొని ఎలా విమర్శల పాలైందో మనకు తెలిసిందే. రీసెంట్గా పదేళ్ల తర్వాత తెలుగులో సినిమాల్లో నటించడానికి .. మీరాజాస్మిన్ సై ఉంటుంది .

తాజాగా మీరాజాస్మిన్ నటించిన సినిమా ” విమానం “. సముద్రఖని ప్రధాన పాత్రలు తెరకెక్కిన ఈ సినిమాలో అనసూయ కూడా రోల్ కనిపించబోతుంది . రీసెంట్ గా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీరాజాస్మిన్ ఓ వీడియోని షేర్ చేసింది . “చాలా గ్యాప్ తర్వాత మీ ముందుకు వస్తున్న.. ఈ కథ నాకు చాలా నచ్చింది. స్టోరీ వినగానే ఎక్కడో బాగా కనెక్ట్ అయ్యాను .

అందుకే ఓకే చెప్పేసాను సినిమా పూర్తయిన తర్వాత నా మైండ్లో కొన్ని ప్రశ్నలు మెదిలాడాయి. అసలు ఈ సినిమా నేను ఎందుకు చేసుకున్నాను . ఎందుకు చూస్ చేసుకున్నాను నిజంగా ఈ విమానాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నానా..? లేక నన్నే ఈ మూవీ ఎంపిక చేసుకుందా..? అర్థం కావట్లేదు. ఏదో అంత తికమకగా అయోమయంగా ఉంది . ఒకటి మాత్రం నిజం గొప్ప అనుభూతి అయితే పొందాను ” అంటూ ఆనందంగా చెప్పుకొచ్చింది. దీంతో మీరాజాస్మిన్ లేటెస్ట్ కామెంట్స్ వైరల్ గా మారాయి..!!