స‌మంత చేసిన ప‌ని చ‌చ్చినా చేయ‌ను.. తెగేసి చెప్పిన కృతి శెట్టి!

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత భ‌ర్త నాగచైతన్య నుంచి విడిపోయిన కొద్ది రోజులకే `పుష్ప` సినిమాలో ‘ఊ అంటావా మామా’ అనే ఐటెం సాంగ్ చేసి ఎంతటి సెన్సేష‌న్ క్రియేట్ చేసేందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సాంగ్ తో నేషనల్ వైడ్ గా ఓ ఊపు ఊపేసింది. నాగ చైతన్య మీద కోపంతోనే సమంత ఈ సాంగ్ చేసింద‌ని అప్ప‌ట్లో ప్రచారం జరిగింది.

సన్నిహితులు ఐటెం సాంగ్ చేయవద్దని వారించినా స‌రే.. స‌మంత వెన‌క్కి త‌గ్గ‌లేదు. త‌న గ్రేస్ ఫుల్ డాన్స్, ఎక్స్‏ప్రెషన్స్ తో ఈ పాటకు మ‌రింత హైప్ తీసుకొచ్చింది. అయితే ఈ సాంగ్ పై తాజాగా కృతి శెట్టి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. `క‌స్ట‌డీ` ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న కృతి శెట్టికి.. పుష్పలో సమంత చేసిన ‘ఊ అంటావా మామా’ వంటి ఐటమ్ సాంగ్ ఆఫ‌ర్ వ‌స్తే చేస్తారా..? అన్న ప్ర‌శ్న ఎదురైంది.

అందుకే కృతి శెట్టి క్ష‌ణంలో ఆలోచించ‌కుండా చేయ‌ను అని తెగేసి చెప్పేసింది. `ప్రస్తుతం నాకు ఐటెం సాంగ్స్ చేసే ఆలోచన లేద‌ని, వాటిపై నాకు అంతగా అవగాహాన లేదు. నేను కంఫర్ట్ గా చేయ‌లేను. శ్యామ్ సింగరాయ్ చిత్రంలో కూడా నానితో రొమాంటిక్ సీన్స్ లో మనస్పూర్తిగా నటించలేకపోయాను. మనసుకు నచ్చనప్పుడు అలాంటివి చేయకుండా ఉండడమే బెటర్ అని అప్పుడే డిసైడ్ అయ్యా. ఇక స‌మంత ఒక ఫైర్‌, ఊ అంటావా మామా పాట‌లో ఆమె అద్భుతంగా డ్యాన్స్ చేసింది. కానీ, నేను ఆమెలా చేయ‌ను` అంటూ కృతి శెట్టి చెప్పుకొచ్చింది.