కెరియర్ నీ మార్చేసే సినిమాని వదులుకున్న అల్లరి నరేష్..!!

నిఖిల్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంగా నిలిచిన చిత్రాలలో కార్తికేయ సినిమా కూడా ఒకటి.. ఇక అప్పటినుంచి సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు రావడం జరుగుతోంది. టాలీవుడ్ లో యంగ్ హీరోల్లో అత్యధిక సక్సెస్ రేట్ ఉన్న హీరోగా పేరు పొందారు. నిఖిల్ కార్తికేయ సినిమా ఒక మిస్టరీ త్రిల్లర్ సినిమాగా తెరకెక్కించారు డైరక్టర్ చందు మొండేటి.. మొదట ఈ చిత్రాన్ని హీరో అల్లరి నరేష్ కి చెప్పారట. కథ కూడా నరేష్ కు విపరీతంగా నచ్చిందట. కానీ కథలో భాగంగా ఈ సినిమాలోని పాములు సన్నివేశాలు ఉండడం చాలా కీలకమని చెప్పవచ్చు.

Karthikeya Telugu Latest Full Length Movie | Nikhil Super Hit Telugu Movie  || Swati Reddy,Tanikella - YouTube
కానీ అల్లరి నరేష్ కు పాములు అంటే చాలా భయమట .అందుకే ఈ సినిమాను రిజెక్ట్ చేయడం జరిగిందట. ఈ విషయాన్ని తానే ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. 2014 అక్టోబర్ 14న కార్తికేయ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం రూ.6 కోట్లా రూపాయల బడ్జెట్ పెట్టగా.. రూ.20 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది ఈ సినిమా సీక్వెల్ని కూడా 2022 ఆగస్టు 13న విడుదల చేయగా పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అయ్యింది.

Allari Naresh in concept movie
అల్లరి నరేష్ కెరీర్ ని మార్చేసే సినిమాని వదులుకోవడంతో అభిమానులు సైతం పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అల్లరి నరేష్ పలు విభిన్నమైన చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అల్లరి నరేష్ కార్తికేయ సినిమాలో నటించి ఉంటే తను ఎప్పటినుంచో యాక్షన్ హీరోగా పేరు పొందే వారిని అభిమానులు భావిస్తున్నారు. నిఖిల్ కూడా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటూ పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు.

Share post:

Latest