`క‌స్ట‌డీ` ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. మ‌రీ ఇంత త‌క్కువా..?

అక్కినేని నాగచైతన్య, కృతి శెట్టి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `క‌స్ట‌డీ`. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీని వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్వ‌కత్వం వ‌హిస్తే.. శ్రీనివాస చిట్టూరి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. ఇందులో అర‌వింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల‌ను పోషించారు.

మే 12న తెలుగు, త‌మిళ భాష‌ల్లో అట్ట‌హాసంగా విడుద‌లైన ఈ సినిమాకు మిక్స్డ్ రివ్యూలు వ‌చ్చాయి. టాక్ అనుకూలంగా లేక‌పోవ‌డంతో ఈ సినిమా దారుణ‌మైన ఓపెనింగ్స్ రాబ‌ట్టింది. రూ. 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ఈ చిత్రం.. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో క‌నీసం రూ. 2 కోట్లు కూడా రాబ‌ట్ట‌లేక‌పోయింది.

రూ. 1.82 కోట్ల షేర్ ని సాధించి తీవ్రంగా నిరాశ పరిచింది. వరల్డ్ వైడ్ గా రూ. 2.62 కోట్ల షేర్ నే సాధించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద క్లీన్ హిట్ గా నిల‌వాలంటే ఇంకా రూ. 22.38 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంది. అయితే ఇంత భారీ టార్గెట్ ను ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో చైతూ రీచ్ అవ్వ‌డం క‌ష్టంగానే క‌నిపిస్తోంది. ఇక ఏరియాల వారీగా క‌స్ట‌డీ ఫ‌స్ట్ డే టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ను ఓసారి గ‌మ‌నిస్తే..

నిజాం: 76 ల‌క్ష‌లు
సీడెడ్: 23 ల‌క్ష‌లు
ఉత్త‌రాంధ్ర‌: 22 ల‌క్ష‌లు
తూర్పు: 11 ల‌క్ష‌లు
పశ్చిమ: 8 ల‌క్ష‌లు
గుంటూరు: 20 ల‌క్ష‌లు
కృష్ణ: 12 ల‌క్ష‌లు
నెల్లూరు: 10 ల‌క్ష‌లు
—————————————
ఏపీ+తెలంగాణ‌= 1.82కోట్లు(3.35కోట్లు~ గ్రాస్‌)
—————————————

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా: 8 ల‌క్ష‌లు
ఓవ‌ర్సీస్‌: 60 ల‌క్ష‌లు
తమిళం – 12 ల‌క్ష‌లు
——————————————-
టోటల్ వరల్డ్ వైడ్= 2.62కోట్లు(5.10కోట్లు~ గ్రాస్)
——————————————-

Share post:

Latest