వారి కంటే అతడే బెస్ట్.. అల్లు అర్జున్‌పై బాలీవుడ్ డ్రీమ్ గాళ్ ప్రశంసలు

పాన్ ఇండియా హీరోగా అల్లు అర్జున్ పేరు సంపాదించాడు. బాలీవుడ్‌లో ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలైన పుష్ప మొదటి పార్ట్ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. అందరికీ షాకిస్తూ ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అల్లు అర్జున్ డైలాగులకు ఎనలేని స్పందన వచ్చింది. దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు, ముఖ్యంగా కేంద్ర మంత్రులు, రాజకీయ ఉద్దండులు కూడా పుష్ప డైలాగులను పలు సందర్భాలలో వాడారు. ఇందులో అల్లు అర్జున్ మాస్ అప్పియరన్స్‌కు బాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అయితే అల్లు అర్జున్‌ కేవలం ప్రేక్షకులకే కాకుండా బాలీవుడ్ ప్రముఖులకు కూడా నచ్చేశాడు. బాలీవుడ్ డ్రీమ్ గాళ్ గా పేరొందిన హేమమాలిని ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసింది. అల్లు అర్జున్ పై ప్రశంసల వర్షం కురిపించింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

‘పుష్ప: ది రైజ్’ చిత్రం ద్వారా ఉత్తరాదిలోనూ అల్లు అర్జున్‌ భారీగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్ మరియు ప్రేక్షకుల హృదయాలలో రాజుగా మార్చాయి. అభిమానులే కాకుండా ఈ వినోద ప్రపంచంలోని స్టార్లు కూడా అల్లు అర్జున్‌ను ప్రశంసిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలిని పేరు కూడా చేరింది. ఇటీవల అల్లు అర్జున్ నటనను ప్రశంసిస్తూ హేమమాలిని మాట్లాడింది. ‘నేను పుష్ప: ది రైజ్ చూశాను. సినిమాలో అల్లు అర్జున్ నటన చాలా బాగుంది.

ముఖ్యంగా ఆయన డ్యాన్స్ స్టెప్స్ అద్భుతంగా వేశారు. అతని నటన నాకు కూడా నచ్చింది. అప్పుడు నేను అతనిని (అల్లు అర్జున్) మరొక చిత్రంలో కూడా చూశాను. అతను చాలా మంచి వ్యక్తి అని గ్రహించాను. లుంగీ కట్టుకున్న పుష్పలో చాలా పల్లెటూరి వ్యక్తిగా, చాలా భిన్నంగా కనిపించాడు. ఇలాంటి క్యారెక్టర్‌ను పోషించేందుకు బాలీవుడ్ హీరోలు సంకోచిస్తారు” అని పేర్కొన్నారు. పుష్ప 2 చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇదే కాకుండా అర్జున్ రెడ్డి సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో అల్లు అర్జున్ ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది కార్యరూపం దాల్చితే మరో ఇండస్ట్రీ హిట్ ఖాయమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Share post:

Latest