కుర్రకారు మదిలో సెగలు పుట్టిస్తున్న హీరోయిన్ ‘అతుల్య రవి’.. ఆమె అందాలకు అంతా ఫిదా

టిక్ టాక్ వీడియోలు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, షార్ట్ ఫిల్మ్‌లు వంటివి చాలా మందికి తమ నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశాలను ఇచ్చాయి. వీటి ద్వారా ఆకట్టుకుని చాలా మంది సినీ అవకాశాలను దక్కించుకున్నారు. ఇటీవల విడుదలైన అఖిల్ ఏజెంట్ సినిమాలోని హీరోయిన్ సాక్షి వైద్యను కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి ఓకే చేశారు. తెలుగులో వరుస సినిమాలు చేసిన ఢిల్లీ భామ కేతిక శర్మ కూడా ఇలానే వెలుగులోకి వచ్చింది. ఇదే తరహాలో డబ్ స్మాష్‌, షార్ట్ ఫిల్మ్‌లతో తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకున్న అతుల్య రవి ప్రస్తుతం సినిమా అవకాశాలను దక్కించుకుంటోంది.

తన తొలి చిత్రం కాదల్ కనకట్టుతే సినిమా అతుల్యకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిందని చెప్పొచ్చు. ఆ తర్వాత సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఏమాలి చిత్రంలో అతుల్య కథానాయికగా నటించింది. ప్రస్తుతం అతుల్య సముద్రఖని దర్శకత్వంలో నాదోతిదీస్ 2లో నటిస్తోంది. నటి అతుల్య సోషల్ మీడియాలో ఎప్పుడూ అభిమానులకు అందుబాటులో ఉంటుంది. తరచూ తన ఫొటోలు షేర్ చేస్తూ అలరిస్తోంది. వాటికి నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. తాజాగా ఓ ఫొటో షూట్ చేసి, దానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టింది.

చీర జాకెట్‌లో అద్భుతంగా ఆ ఫొటోలలో అతుల్య రవి కనిపిస్తోంది. ఆమె ఫొటోలు చూసిన కుర్రాళ్లకు నిద్ర కరువవుతోంది. తరచూ ఆమె చీరలో ఫొటోలు దిగుతూ తన అందచందాలతో అభిమానులను ఆకట్టుకుంటోంది. చూపు తిప్పుకోనివ్వని అందంతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. గతంలో ఆమె జాకెట్ వేసుకోకుండా కేవలం చీర కట్టుకుని దర్శనమిచ్చింది. ఆ ఫొటోలకు నెటిజన్ల నుంచి ఊహించని స్పందన వచ్చింది. అయితే అదే సమయంలో ఆమెకు జాకెట్ వేసుకునే అలవాటు లేదేమో అనే కామెంట్లు వచ్చాయి. కరోనా కాలంలో ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలోనూ ఆమె వరుస ఫొటో షూట్స్ చేసింది. ఆ ఫొటోలను తరచూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చింది.

Share post:

Latest