వధువు కావాలంటూ ప్ర‌క‌ట‌న చేసిన త‌మ‌న్నా ప్రియుడు.. దిమ్మ‌తిరిగే షాకిచ్చిన నెటిజ‌న్లు!

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా, బాలీవుడ్ న‌టుడు విజ‌య్ వ‌ర్మ ప్రేమ‌లో ఉన్నారంటూ గ‌త కొద్ది రోజుల నుంచి ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది న్యూ ఇయిర్ ను వీరిద్ద‌రూ జంట‌గా గోవాలో సెల‌బ్రేట్ చేసుకోవ‌డం.. పార్టీలో విజ‌య్ వ‌ర్మ‌పై త‌మ‌న్నా హ‌గ్గులు, ముద్దుల వ‌ర్షం కురిపించిన వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో ర‌చ్చ మొద‌లైంది.

 

త‌మ‌న్నా, విజ‌య్ డేటింగ్ లో ఉన్నార‌ని.. పెళ్లి చేసుకునే ఆలోచ‌న‌లో కూడా ఉన్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వార్త‌ల‌కు బ‌లంగా చేకూరిస్తూ విజ‌య్‌, త‌మ‌న్నా జంట‌గా ప‌లు మార్లు మీడియాకు చిక్కారు. ఇదిలా ఉంటే.. తాజాగా విజయ్ వర్మ నటించిన వెబ్ సిరీస్ `దాహడ్` స్ట్రీమింగ్ కు సిద్ధం అవుతోంది. అయితే ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ వర్మ పేరుతో ఓ ప్రకటన విడుదల చేశారు.

అతని గుణగణాలు, అందచందాలు తెలియజేస్తూ వధువు కావలెను అని పోస్టర్ వేశారు. అయితే ఈ ప్రమోషనల్ పోస్టర్ చూసిన నెటిజ‌న్లు విజ‌య్ కు దిమ్మ‌తిరిగే షాకిచ్చారు. ఆల్రెడీ త‌మ‌న్నా ఉందిగా.. మ‌రొక అమ్మాయి ఎందుకు అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. ఈ జ‌న్మ‌కు త‌మ‌న్నానే నీ భార్య‌.. నువ్వే త‌మ‌న్నా భ‌ర్త అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఊహించని ఈ రెస్పాన్స్ కి విజయ్ వర్మతో పాటు టీమ్ మొత్తం ఖంగుతిన్నారు.