ఆ కారణం వల్లే హీరోయిన్ ని చెప్పుతో కొట్టా.. జయసుధ షాకింగ్ కామెంట్స్..!!

ఒకప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ పాపులారిటీని సంపాదించుకున్న హీరోయిన్ జయసుధ..ఈమె ఒకప్పటి అగ్ర హీరోల సరసన నటించింది. జయసుధ ఇప్పటికి కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా దూసుకుపోతోంది. ముఖ్యంగా ఇప్పుడు తల్లి పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను ఇంకాస్త మెప్పిస్తోంది. హీరోయిన్ గా జయసుధ మంచి ట్రెండింగ్ లో ఉన్నప్పుడు మంచి మంచి అవకాశాలు వచ్చాయి. కాస్త ఏజ్ అయ్యే కొద్దీ సినిమా అవకాశాలు తగ్గు ముఖం పట్టాయి.

జయసుధకు సహజ నటి అని బిరుదు కూడా ఉంది. ఇదంతా ఇలా ఉండగా ఈమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఒక స్టార్ ప్రముఖ హీరోయిన్తో గొడవ జరిగిన సంగతి తెలిపింది. జయసుధ దాసరి నారాయణ దర్శకత్వంలో ‘కటకటాల రుద్రయ్య’ అనే సినిమాలో నటించిందట.. ఆ సినిమాలో తనకు మరిక హీరోయిన్ కి గొడవ జరిగిందట. ఇందులో కృష్ణంరాజు హీరోగా నటించగా జయసుధ హీరోయిన్గా నటించింది. అయితే ఇందులో సెకండ్ హీరోయిన్ గా జయచిత్ర నటించింది. అయితే మా ఇద్దరికీ చెప్పుల విషయంలో గొడవ జరిగింది. నేను కొద్దిగా హై హీల్స్ వాడే దాన్ని ఆ చెప్పులు వేసుకుని ఆ అమ్మాయి ముందుకు వస్తే తనకి నచ్చేది కాదట.. తనకు నచ్చకపోవటంతో చెప్పులు విప్పేసి రా అని చెప్పేది.

నేను విప్పను ఎందుకు విప్పాలి అని పక్కకు వెళ్లాను. తను ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని ఆ సినిమాలో మేమిద్దరం కొట్టుకొనే సన్నివేశం ఒకటి ఉంది. అందులో మేమిద్దరం బాగా గొడవపడాలి అప్పుడు జయచిత్ర నన్ను చాలా గట్టిగా కొట్టింది. నేను కూడా చెప్పు తీసుకొని కొట్టాను. ఇలా మేమిద్దరం కొట్టుకుంటూనే ఉన్నాము. అయితే ఇందులో విశేషం ఏమిటంటే మేమిద్దరం కొట్టుకున్న ఆ సన్నివేశమే సినిమాలో పెద్ద హైలెట్గా మారింది. అంటూ జయసుధ తన మాటలతో అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసింది.

Share post:

Latest