భార్యపై ఫన్నీ పోస్ట్ పెట్టిన హీరో యశ్.. మురిసిపోతున్న ఫ్యాన్స్..

చిన్న సీరియల్ నటుడిగా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు యశ్. కేజిఎఫ్ సినిమాతో భారతదేశ వ్యాప్తంగా సూపర్ పాపులర్ అయిన యశ్ రాధిక పండిట్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఈ ముద్దుగుమ్మను 2016లో ఈ కన్నడ హీరో పెళ్లి చేసుకున్నాడు. రాధిక కూడా టీవీ సీరియల్స్‌లో నటించింది. అంతేకాకుండా, ఆమె సినిమాల్లో కూడా మెరిసింది. వీరిద్దరూ బెస్ట్ కపుల్‌గా కనిపిస్తూ అందరికీ ముచ్చట గొలుపుతున్నారు. కపుల్ గోల్స్ కూడా పెంచుతున్నారు. తాజాగా యశ్ తన భార్యపై ఒక ఫన్నీ పోస్ట్ షేర్ చేశాడు. దీన్ని చూసి కొందరు ఫ్యాన్స్ నవ్వుకుంటుంటే, మరికొందరు ఫిదా అవుతున్నారు.

ఈ పోస్టులో ఒక అందమైన ప్రదేశంలో యశ్ తన భార్యతో కలిసి నడుస్తూ కనిపించాడు. అలా ఒకరికొకరు హ్యాపీగా నడవడాన్ని తన భార్య కోరుకుంటుందని, కానీ రియాలిటీలో తాము పిల్లలతో ఎవరికి వారు బిజీగా ఉంటామని ఇంకో ఫోటో ద్వారా ఫన్నీగా చెప్పాడు. యశ్, రాధికకి ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే.

 

 

View this post on Instagram

 

A post shared by Yash (@thenameisyash)

యశ్ కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా తర్వాత మరో సినిమాకి సైన్ చేయలేదు. ప్రస్తుతానికి ఫ్యామిలీతో కలిసి క్వాలిటీ టైమ్ గడుపుతున్నాడు. ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తీస్తున్న సలార్ మూవీలో ఒక కామియో రోల్ చేస్తున్నాడు. ఇందులో ప్రభాస్ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్‌గా చేస్తోంది. మూవీ సెప్టెంబర్ నెలలో రిలీజ్ కానుంది. కాగా యశ్‌ది గెస్ట్ రోల్ అయినా సరే దానిపై చాలా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో ప్రభాస్ రేంజ్ వేరే లెవెల్ లోకి వెళ్తుందని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి త్వరలో యశ్‌ ఏ డైరెక్టర్‌తో, ఎలాంటి సినిమా ప్రకటిస్తాడో చూడాలి.

Share post:

Latest