శ్రీలీల తొందరతనం.. నిర్మాతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న యంగ్ బ్యూటి..ఏం చేసిందంటే..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో యంగ్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న శ్రీలీల హవ ఎలా కొనసాగుతుందో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వెబ్ మీడియాలో సోషల్ మీడియాలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో శ్రీలీల పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనకు తెలిసిందే. దానంతటికీ కారణం శ్రీలీల చేతిలో ఏకంగా 12 సినిమాలు ఉండడమే అంటూ తెలుస్తుంది . ఇప్పటివరకు అమ్మడు నటించిన సినిమాలు తెలుగులో రిలీజ్ అయింది రెండంటే రెండే ..

ఒకటి పెళ్లి సందడ్.. రెండు ధమాకా.. పెళ్లి సందడి యావరేజ్ అయిన కూడా ధమాకా మాత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఈ క్రమంలోని శ్రీలీల సైతం తన రెమ్యూనరేషన్ పెంచేసి స్టార్ హీరో సినిమాలలో అవకాశాలు అందుకుంటుంది . అయితే శ్రీలీల ప్రజెంట్ 9 సినిమాలకు కమిట్ అయింది. 9 సినిమాలలో మూడు సినిమాల్లో షూటింగ్ బిజీగా ఉంటే.. మిగతా ఆరు సినిమాలో సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి.

ఈ క్రమంలోనే శ్రీలీల కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేకపోతుందట . ఒకరోజు శ్రీ లీల హైదరాబాద్లో ఉంటే మరో రోజు వేరే ఊరికి కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిపోతుంది . ఈ క్రమంలోనే శ్రీ లీల తప్పు చేసింది అన్న వార్తలు ఎక్కువగా వినపడుతున్నాయి .. ఒక సినిమాకి మరో సినిమాకి కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయడంలో.. శ్రీలీల ఫ్లాప్ అయిందని ఈ తప్పుడు నిర్ణయంతో నిర్మాతలకు కొత్త తలనొప్పులు క్రియేట్ అయ్యాయి అంటూ చెప్పుకొస్తున్నారు . అంతేకాదు ఇప్పుడు శ్రీలీల ఎవరు సినిమాని స్కిప్ చేస్తుందా ..? అంటూ భయపడిపోతున్నారు. ఒకేరోజు నాలుగైదు సినిమాలు షూటింగ్ అంటే చాలా కష్టమంటూ చెప్పుకొస్తున్నారు . ఇన్ని తెలివితేటలు ఉన్న శ్రీలీలకి ఆమాత్రం తెలియదా..? అంటూ ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకుతాయిలు.

 

Share post:

Latest