శ్రీముఖికి ఆల్రెడీ పెళ్లయి, పిల్లలు ఉన్నారా.. ఫ్రెండ్ షాకింగ్ కామెంట్స్!

తెలుగు బుల్లితెర రంగంలో ఎందరో ఫిమేల్ యాంకర్స్ అడుగు పెట్టారు. వారిలో సక్సెస్ అయ్యింది మాత్రం కొందరే. ఆ జాబితాలో శ్రీముఖి ముందు వరుసలో ఉంటుంది. ఈ మద్దుగుమ్మ చాలా ఏళ్లుగా బిజియస్ట్ యాంకర్‌గా కొనసాగుతోంది. ఈ రోజుల్లో ఈ తార చేస్తున్న “ఆదివారం విత్ స్టార్ మా పరివారం” బాగా ఆకట్టుకుంటోంది. ఈ షోలో ముక్కు అవినాష్, ఫైమాతో సహా మరికొందరు ఎంతో వినోదాన్ని పంచుతున్నారు. శ్రీముఖి అవినాష్ మంచి ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే. అయితే ఫ్రెండ్ అనుకుని శ్రీముఖి షాకిస్తుంటే తాజాగా అతడు ఆమెకు షాక్ ఇచ్చాడు.

“ఆదివారం విత్ స్టార్ మా పరివారం” షో ప్రతి సండే ప్రసారమవుతుంది. ఈసారి సండే ఎపిసోడ్‌లో బుల్లితెర సెలబ్రిటీలు విచ్చేశారు. వీరు బుల్లితెరపై రాణిస్తున్న బుల్లి స్టార్ సింగర్స్‌. వాళ్లు రెండు టీమ్‌లుగా ఏర్పడగా వారితో శ్రీముఖి తెగ అల్లరి చేసింది అయితే ఇంతలోనే ముక్కు అవినాష్ అక్కడికి వచ్చి ఏంటి శ్రీముఖి నీకు ఆల్రెడీ పెళ్లయిందా ఇంతమంది పిల్లలు కూడా ఉన్నారా అని కామెంట్ చేశాడు దాంతో శ్రీముఖి ఒక్కసారిగా అవాక్కయింది. తనకి పెళ్లి కావడం ఏంటి? తల్లి కావడం ఏంటి? అని ఒక షాకింగ్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది. ఆ తర్వాత వీరు తన పిల్లలు కాదని స్టార్ మా పిల్లలని చెప్పి అవినాష్ నోరుకి తాళం వేసింది.

 

ఆ తర్వాత అవినాష్ శ్రీముఖి జోలికి వెళ్లకుండా కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్‌లు చెప్పి షాక్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీనిని మీరు కూడా చూసేయండి.

Share post:

Latest