స్టార్ హీరోయిన్ సమంత ఇన్‌వాల్వ్‌మెంట్ తన సినిమాలలో ఈ మధ్య బాగా ఎక్కువవుతుందనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. కథ చెప్పినప్పటి నుంచి ఎడిటింగ్ అయ్యే వరకు ఎక్కువగా అన్ని విషయాలలో కలుగజేసుకుంటుందనే మాట బాగా వినిపిస్తుంది. సమంత నటించిన మొదటి సినిమా ఏ మాయచేశావే నుంచి గత చిత్రం శాకుంతలం వరకు ఈ మాట గట్టిగా వినిపిస్తుంది.
తెలుగుతో పాటు తమిళంలో సమంత సంపాదించుకున్న క్రేజ్ అంతా ఇంతాకాదు. ఇక అక్కడ, ఇక్కడ దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించింది. ఎక్కువ శాతం తన ఖాతాలో హిట్ సినిమాలే ఉన్నాయి. చాలా తక్కువ సినిమాలే సమంత తన డైరీలో డిజాస్టర్స్‌గా చేరాయి. ఇక మేకర్స్‌తో హీరోలతో ఒద్దికగా ఉండటంతో సమంతని ఎక్కువగా తమ సినిమాలలో తీసుకున్నారు.
అయితే, గతంలో సమంత దర్శకుడు చెప్పినట్టుగా వినేదట. కానీ, తను సోలో హీరోయిన్‌గా నటించడం మొదలుపెట్టినప్పటి నుంచి మేకర్స్‌ను కాస్త ఇబ్బందిపెడుతుందని ఇండస్ట్రీ జనాలు తరచూ మాట్లాడుకుంటున్నారు. ఇది యూటర్న్ సినిమా నుంచి మొదలైందని అంటూ చాలామంది అభిప్రాయపడుతున్నారు. యూటర్న్ తెలుగు వెర్షన్ చేయాల్సిన దర్శకుడు వేరే. కానీ, సమంత వల్ల ఒరిజినల్ తెరకెక్కించిన దర్శకుడినే తీసుకున్నారు.
ఇక తనకి నచ్చకపోతే కథలో ముఖ్యమైన సన్నివేశాలను మార్పిస్తుందట. ఇటీవల వచ్చి ఫ్లాపైన శాకుంతలం సినిమా విషయంలో సమంత ఎక్కువగా కలుగజేసుకుందట. దర్శకులకు పెద్దగా ఫ్రీడం ఇవ్వలేదట. విజయ్ దేవరకోండతో కలిసి నటిస్తున్న ఖుషి సినిమా విషయంలో కూడా ఇదే విధంగా ఉంది అన్ని అంటున్నారు. సంమంత సినిమాలపై వస్తున్నా ఈ వార్తలు నిజమైతే సమంత ఇకపై సక్సెస్‌లు చూడటం కష్టమే.