ఆ హీరోయిన్ వల్లే చిరంజీవికి ఆవంటే పీచ్చట..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన హీరోగా పేరు పొందారు చిరంజీవి. చిరంజీవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇప్పటికీ హీరోగా నటిస్తూ పలు చిత్రాలను తెరకెక్కిస్తూ అభిమానులను బాగా ఆకట్టుకుంటూ ఉన్నారు. చిరంజీవికి చాలా ఇష్టమైన వాటిలో కార్లు కూడా ఒకటి.. మార్కెట్లోకి ఎలాంటి కొత్త టెక్నాలజీ కార్లు వచ్చినా కూడా తప్పకుండా చిరంజీవి వాటిని కొంటూ ఉండేవారట. కానీ చిరంజీవికి ఇలా కార్లు అంటే ఇష్టం ఉండడానికి ఒక హీరోయిన్ చేసిన అవమానమే అన్నట్లుగా తెలుస్తోంది.

Kothala Rayudu Songs - Yenda Vaana Song - Chiranjeevi, Madhavi - YouTube
చిరంజీవి ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న సమయంలో హీరోయిన్ మాధవి తో కలిసి ఖైదీ సినిమాలో నటించారు.. ఈ సినిమా అవుట్ డోర్ షూటింగ్ సమయంలో ఒకరోజు చిరంజీవి గారి కోసం కారు రాలేదట.అయితే చిరంజీవి కారు కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఆ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న మాధవి కోసం వచ్చిన కారులో చిరంజీవి ప్రయాణించాల్సి వచ్చిందట.. అయితే మాధవి తో కలిసి వెనుక సీట్లు కూర్చున్న చిరంజీవినీ చూసి మాధవి మీరు వెళ్లి ముందు సీట్లు కూర్చోండి అంటూ చిరంజీవితో మాట్లాడుతూ ఇది నా కోసమే ఏర్పాటు చేసిన కారు మీరు వెళ్లి ముందు కూర్చోండి అంటూ హెలన చేసిందట.

దీంతో చిరంజీవి తనకు సారీ చెప్పి ముందుకు వెళ్లి కూర్చున్నారట. అలా ఆ హీరోయిన్ చేసిన అవమానం వల్ల చిరంజీవికి కారులు అంటే ఇష్టం వచ్చేలా చేసిందని అందుకే ఎలాంటి కొత్త కారు మార్కెట్లోకి విడుదలైన కూడా వెంటనే చిరంజీవి ఆకారులను కొంటూ ఉంటారని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఇప్పటికీ కూడా చిరంజీవి ఆ పిచ్చితోని కార్లు కొంటున్నట్లు తెలుస్తోంది.

Share post:

Latest