ఆ సీక్రెట్ తెలిస్తే ప్లాపులు ఎందుకు వ‌స్తాయి… కృతిశెట్టి హాట్ కామెంట్స్‌..!

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన కృతిశెట్టి ఉప్పెన సినిమా సక్సెస్ తో ఓవర్ నైట్ లో ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఉప్పెన సినిమా కృతిశెట్టి రేంజ్ ను పెంచడంతో పాటు కృతిశెట్టి రెమ్యునరేషన్ ఊహించని స్థాయిలో పెరగడానికి కూడా కారణమైందనే సంగతి తెలిసిందే. ఆ తర్వాత కృతిశెట్టి నటించిన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలు సక్సెస్ సాధించినా మరీ బ్లాక్ బస్టర్ హిట్లు కాదు. అయితే ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాల ఫలితాలతో కృతిశెట్టికి భారీ షాకులు తగిలాయి.

Krithi Shetty | చిట్టిపొట్టి దుస్తుల్లో కృతి శెట్టి మెరుపులు..-Namasthe  Telangana

నాగచైతన్య హీరోగా నటిస్తున్న కస్టడీ సినిమాలో కృతి హీరోయిన్‌గా నటిస్తుంది మళ్ళీ ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వెళ్లాలని ప్రయత్నిస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కృతిశెట్టి మాట్లాడుతూ కస్టడీ మూవీలో హీరో విలన్ ను కాపాడటానికి ప్రయత్నిస్తాడని… కథ సీరియస్ అవుతున్న సమయంలో నా రోల్ బ్యాలెన్స్ చేస్తుందని నా రోల్ నిడివి కూడా ఎక్కువని కస్టడీ మూవీ కొరకు జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేశానని కృతిశెట్టి చెప్పుకొచ్చారు.

నాగ చైతన్యపై ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్న ఉప్పెన బ్యూటీ | Krithi Shetty  Naga Chaitanya Custody Movie Hopes Details, Custody, Krithi Shetty, Naga  Chaitanya, Krithi Shetty Custody Movie, Director ...

ఈ సినిమాలో అండర్‌ వాటర్‌ యాక్షన్‌ సీన్స్‌ కూడా ఉన్నాయి. ఈ యాక్షన్‌ సీన్స్‌ తీయడానికి 15 రోజులు పట్టింది. ఇందులో 5 రోజులు పూర్తిగా 20 ఫీట్ల వాటర్‌ పూల్‌లో షూటింగ్‌ చేశాం. తీసే ముందు రెండు రోజులుప్రాక్టీస్‌ చేశాం. కొన్నిసార్లు 40 సెకండ్ల నుంచి ఒక నిమిషం వరకు ఊపిరి తీసుకోకుండా చేయాల్సి వచ్చింది. ఈ సీన్లలో చైతూ, సంపత్‌గారు, అరవింద్‌ స్వామిగారు, నేను ఉంటామ‌ని చెప్పింది.

పర్సనల్ గా నేను రౌడీనే.. వైరల్ అవుతున్న కృతిశెట్టి సంచలన వ్యాఖ్యలు | krithi  shetty sensational comments goes viral in social details here,krithi shetty ,uppena,custody,naga chaitanya, krithi shetty ...

అందుకే భయం వేసింది. ఎందుకంటే ఎవరికి ‘అన్‌ ఈజీ’గా అనిపించినా మళ్లీ సీన్‌ తీయాల్సి ఉంటుంది. నా కారణంగా అలాంటి ఇబ్బంది ఎదురు కాకూడదని కోరుకున్నాను. కస్టడీ సెట్స్ లో నేను రౌడీలా ఉన్నానని దర్శకుడు అన్నారని పర్సనల్ గా కూడా నేను రౌడీనే అని ఆమె చెప్పుకొచ్చారు. సక్సెస్ రెసిపీ ఎవరికీ తెలియదని అది తెలిస్తే అన్నీ హిట్లే వస్తాయి.. మా వంతుగా మేం చేయగలిగింది కష్టపడి పని చేయడమే..అని ఆ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్లు చేసింది కృతిశెట్టి.

Share post:

Latest