మహర్షి సినిమాలో అల్ల‌రి న‌రేష్ రోల్ వ‌దులుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రంటే…!

తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సూపర్ హిట్ సినిమాల్లి మహర్షి కూడా ఒకటి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. అల్లరి నరేష్, జగపతిబాబు, ప్రకాష్ రాజ్‌ వంటి వారిరు కీలకపాత్రలో నటించారు. దిల్ రాజు, అశ్విని దత్, పివిపి బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కిన ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు.

Maharshi movie review: The Mahesh Babu film is a crowd pleaser |  Entertainment News,The Indian Express

2019లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అలాగే అల్లరి నరేష్ కెరీర్‌ను మరో మలుపు తిప్పిన సినిమాగా నిలిచింది. అప్పటివరకు కామెడీ సినిమాలకే పరిమితమైన నరేష్ మహర్షి సినిమా ద్వారా తనలోని నటుడిని చిత్ర పరిశ్రమకు పరిచయం చేశాడు. ఈ సినిమాలో మహేష్ బాబు ఫ్రెండ్ రవిగా ఎంతో ఎమోషన్స్ ఉన్న పాత్రలో నరేష్ ఎంతో అద్భుతంగా నటించాడని చెప్పాలి. కామెడీ సినిమాలతో అప్పటివరకు నవ్వించిన అల్లరి నరేష్ ఈ సినిమాతో ఒక్కసారిగా ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించాడు.

ఈ సినిమా తర్వాత నుంచి నరేష్ కామెడీ కథల‌ను పక్కన పెట్టి నటనకు స్కోప్ ఉన్న సీరియస్ కథలతో కెరీర్‌ను ముందుకు తీసుకు వెళ్తున్నాడు. అయితే ఇక్కడ ఓ సర్ప్రైజింగ్ విషయం ఏమిటంటే.. మహర్షి సినిమాలో అల్లరి నరేష్ పాత్రకి ఫ‌స్ట్ ఛాయిస్ ఆయ‌న కాద‌ట‌.. ఈ పాత్ర కోసం ముందుగా ఓ మెగా హీరో వద్దకు వంశీ పైడిపల్లి వెళ్లారట.. ఆ హీరో రిజెక్ట్ చేయడంతో ఆ పాత్ర అల్లరి నరేష్ కి వచ్చిందట. ఇంతకీ ఆ పాత్ర వద్దనుకున్న మెగా హీరో మరెవరో కాదు సాయి ధరమ్ తేజ్.

సాయి ధరమ్ తేజ్ అప్పటికే తన కెరీర్‌లో వరుస అపజయాలతో సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు.. అలాంటి సమయంలో ఈ పాత్ర చేయడం వల్ల తేజ్ కి ఎంతో మైలేజ్ వస్తుందని వంశీ పైడిపల్లి భావించాడట.. ఆ కారణంగానే మహర్షి కోసం తేజ్‌ను సంప్రదించారు.. కానీ పలు కారణాల చేత తేజ్ రవి పాత్రను రిజెక్ట్ చేశాడు. ఆ విధంగా అల్లరి నరేష్ ఈ సినిమాలో ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు.

Share post:

Latest