`రామ‌బాణం`తో గోపీచంద్ ఖాతాలో మ‌రో డిజాస్ట‌ర్‌.. రూ. 15 కోట్ల టార్గెట్ కు వ‌చ్చింది అంతేనా?

టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచింద్, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శ్రీ‌వాస్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్ మూవీ `రామాబాణం`. ఇందులో డింపుల్ హ‌యాతి హీరోయిన్ గా న‌టించింది. జ‌గ‌ప‌తిబాబు, ఖుష్బూ, నాజ‌ర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం మే 5న‌ గ్రాండ్ రిలీజ్ అయింది.

కానీ, అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది. టాక్ అనుకూలంగా లేక‌పోవ‌డంతో యావ‌రేజ్ ఓపెనింగ్స్ రాబ‌ట్టింది. రెండో రోజు ఈ మూవీ క‌లెక్ష‌న్స్ మ‌రింత డ‌ల్ అయ్యాయి. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.17 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్న రామ‌బాణం.. రెండో రోజు రూ. 80 ల‌క్ష‌ల‌తో స‌రిపెట్టుకుంది. అలాగే రెండు రోజుల్లో వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 2.13 కోట్ల షేర్‌ను రాబ‌ట్టింది. ఇక ఏరియాల వారీగా రామబాణం 2 డేస్‌ టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ను ఓసారి గ‌మ‌నిస్తే..

నైజాం: 77ల‌క్ష‌లు
సీడెడ్: 27 ల‌క్ష‌లు
ఉత్త‌రాంధ్ర‌: 23 ల‌క్ష‌లు
తూర్పు: 17 ల‌క్ష‌లు
పశ్చిమ: 10 ల‌క్ష‌లు
గుంటూరు: 13 ల‌క్ష‌లు
కృష్ణ: 13 ల‌క్ష‌లు
నెల్లూరు: 8 ల‌క్ష‌లు
—————————————–
ఏపీ+తెలంగాణ‌ మొత్తం= 1.98 కోట్లు(3.70 కోట్లు~ గ్రాస్‌)
—————————————–

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా+ఓవ‌ర్సీ: 15 ల‌క్ష‌లు
———————————————-
వ‌ర‌ల్డ్ వైడ్‌ కలెక్షన్‌= 2.13 కోట్లు(4.10 కోట్లు~ గ్రాస్)
———————————————-

కాగా, రూ.15.20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన రామ‌బాణం.. బాక్సాఫీస్ వ‌ద్ద క్లీన్ హిట్ గా నిల‌వాలంటే మొదటి రెండు రోజులు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రూ. 13.07 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. కానీ, ఈ పెద్ద టార్గెట్ ను గోపీచంద్ అందుకోవ‌డ‌మే క‌ష్ట‌మే అంటున్నారు. రామ‌బాణంతో ఆయ‌న ఖాతాలో మ‌రో డిజాస్ట‌ర్ ఖాయ‌మ‌ని సినీ పండితులు చెబుతున్నారు.