ఎన్టీఆర్ అభిమానులకు యంగ్ టైగర్ బర్త్‌డే గిఫ్ట్.. బ్లాస్టింగ్ అప్డేట్ ..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న తన తన 30వ సినిమాను కొరటాల శివతో చేస్తున్నాడు. ఇప్పటికే వీరి కాంబోలో జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా కూడా వచ్చింది. ఇప్పుడు వీరి కాంబోలో వస్తున్న ఎన్టీఆర్ 30వ సినిమాపై కూడా టాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జంటగా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, మరో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా చేస్తున్నాడు. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రతి అప్డేట్ ప్రతి ఒక్కరిని ఎంతో ఎగ్జిట్ చేస్తూనే ఉంది. చాలా టైం తీసుకుని మరి కొరటాల ఈ సినిమా స్క్రిప్ట్ ని పూర్తి చేసి కొన్ని వారాల కిందటే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టాడు.

పాన్ ఇండియా లెవ‌ల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా..? అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి ఏ అప్డేట్ వచ్చినా నిమిషాల్లో అది వైరల్ గా మారుతుంది. ఇప్పుడు ఎన్టీఆర్30వ సినిమా నుంచి ఓ క్రేజీ టాక్ వినిపిస్తుంది. ఈనెల‌20న తార‌క్ బ‌ర్త్‌డే కానుక‌గా ఈ సినిమా నుంచి ఎవ‌రు ఉహించ‌ని ఆప్‌డ్ట్ రాబోతుంది అన్ని తెలుస్తుంది. మ‌రి ఎన్టీఆర్ ఈ సినిమాతో ఎలాంటి రికార్డులు అందుకుంట‌డో చూడాలి.