హీరోల జీవితాలతో ఆడుకుంటున్న డింపుల్‌.. ఇప్ప‌టికే అంత మంది బ‌ల‌య్యారా?

సినీ పరిశ్రమలో సెంటిమెంట్స్ కు కొద‌వే లేదు. కోట్ల‌లో ముడిప‌డిన బిజినెస్ కావ‌డంలో ద‌ర్శ‌క‌నిర్మాల‌తో పాటు హీరోలు కూడా సెంటిమెంట్స్‌ను ఫాలో అవుతుంటారు. హిట్ ఫార్ములా, కాంబినేషన్స్, టైటిల్స్, హీరోయిన్స్ ఇలా పలు విషయాల్లో సెంటిమెంట్స్ గట్టిగా నమ్ముతారు. వాటిని బ్రేక్ చేసి రిస్క్‌లు తీసుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు.

అలాగే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకునే హీరోయిన్ల‌కే ఆఫ‌ర్లు క్యూ క‌డ‌తాయి. పొర‌పాటును మూడు, నాలుగు ఫ్లాపులు వ‌ర‌స‌గా ప‌డ్డాయి అంటే ఐర‌న్ లెగ్ అనే ట్యాగ్ ను త‌గిలించి ఈ హీరోయిన్ ను ప‌క్కన పెట్టేస్తారు. ఇలా బ‌లైపోయిన హీరోయిన్లు ఇండ‌స్ట్రీలో ఎందురో ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితాలో యంగ్ బ్యూటీ డింపుల్ హ‌యాతి కూడా చేరేలా క‌నిపిస్తోంది. హైదరాబాదులో పుట్టిన డింపుల్ కు ఆక‌ట్టుకునే అందం, మంచి టాలెంట్ ఉన్నా స‌క్సెస్ మాత్రం లేదు. కెరీర్ ఆరంభం నుంచి ఆ అమ్మ‌డి ఖాతాలో ఒక్క హిట్ కూడా ప‌డ‌లేదు. స్టార్టింగ్ లో గల్ఫ్, యురేక వంటి చిత్రాల్లో న‌టించింది. అవేమి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక‌పోయాయి.

ఆ త‌ర్వాత విశాల్ తో `సామాన్యుడు`, ర‌వితేజ‌తో `ఖిలాడి`, రీసెంట్‌గా గోపీచంద్ లో `రామాబాణం` వంటి చిత్రాల్లో హీరోయిన్ గా న‌టించింది. ఇవ‌న్నీ కూడా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ్డాయి. దీంతో డింపుల్ ఉంటే ఉంటే మూవీ ప్లాప్ అనే సెంటిమెంట్ బలపడింది. ఈ క్ర‌మంలోనే నెటిజ‌న్లు డింపుల్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. హీరోల జీవితాల‌తో డింపుల్ ఆడుకుంటుంద‌ని.. ఆమె ఐర‌న్ లెగ వ‌ల్లే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయ‌ని కామెంట్స్ చేస్తున్నారు. డింపుల్ దెబ్బ‌కు కుర్ర హీరోల‌తో పాటు విశాల్, రవితేజ ఇప్పుడు గోపిచంద్ వంటి పెద్ద హీరోలు కూడా బ‌లైపోయారంటూ అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Share post:

Latest