లైగర్ లాంటి భారీ ఫ్లాప్ తర్వాత విజయ్ దేవరకోండ నుంచి వస్తున్న తాజా మూవీ ఖుషి శివ నిర్వణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్‌కు జంటగా సమంత నటిస్తుంది. సమంత కూడా ప్రస్తుతం వరుస ఫ్లాప్‌లతో సతమతం అవుతుంది. అలాంటి ఈ ఇద్దరికి మళ్ళీ ఈ సినిమాతో హిట్ అందుకుంటారో లేదో చూడాలి.
‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి ప్రేమ కథల్ని తెరకెక్కించిన శివ నిర్వాణ ఈసారి ‘ఖుషి’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వాస్తవానికి ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకోవాల్సి ఉండగా..మధ్యలో సమంత అనారోగ్యానికి గురి కావడం తో షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. రీసెంట్ గా సమంత అనారోగ్యం నుంచి బయటపడడంతో మళ్లీ షూటింగ్ మొదలైంది.
సెప్టెంబర్2న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సమయంలో ఈరోజు సినిమాలోని ‘నా రోజా నువ్వే’ అంటూ సాగే పాట గ్లింప్స్ వీడియోను సినిమా యూనిట్ రిలీజ్ చేసింది. మొత్తానికి అయితే ఈ ఫస్ట్ సాంగ్ ప్రోమో ఎంతో చూడా ముచ్చటగా ప్రామిసింగ్ గా ఉంది. మరి ఈ ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఈనెల 9న విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఈ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్ చేయనున్నారు.