అదరగొట్టేస్తున్న సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన టీజర్..!!

టాలీవుడ్ లో యంగ్ హీరో సందీప్ కిషన్ వరుసగా సినిమాలను తెరకెక్కిస్తున్నా వరుస ప్లాపులే చుట్టు ముడుతున్నాయి. దీంతో ఈ హీరో పని అయిపోయింది అనుకుంటున్న సమయంలో మరొకసారి ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. సందీప్ కిషన్ హిట్ కొట్టి దాదాపుగా కొన్ని సంవత్సరాలు పైనే అవుతోంది.. ఎలాంటి సినిమా చేసినా..ఎన్ని ప్రయోగాలు చేసినా సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నారు. ఈ రోజున సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా తన సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ రావడం జరిగింది.

సందీప్ కిషన్ తాజాగా నటిస్తున్న చిత్రం ఊరి పేరు భైరవకోన. ఈ సినిమా హర్రర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ తో పాటు సాంగ్ ను కూడా విడుదల చేయడం జరిగింది. అవి ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ ని విడుదల చేయడం జరిగింది మేకర్స్. ఈసారి పురాణాల కథతో సందీప్ కిషన్ హిట్ కొట్టాలనే పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

ఈ సినిమా గరుడ పురాణం గ్రంథం చుట్టూ తిరగబోతున్నట్లుగా ఈ టీజర్ లో కనిపిస్తోంది. గరుడ పురాణంలో మిస్సయిన నాలుగు పేజీల కథాంశం తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. టీజర్ వరకు ఇంపాక్ట్ చూపిస్తున్నా.. మరి విజువల్ పరంగా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి మరి. ఈ సినిమాని డైరెక్టర్ వి ఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో వర్షా బొల్లమ్మ, కావ్య దాపరి వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తూ ఉన్నారు. మరి ఈసారైనా ఆయన సక్సెస్ అందుకుంటారో లేదో చూడాలి.

Share post:

Latest