బాక్సాఫీస్ వ‌ద్ద జోరు పెంచిన అల్ల‌రోడు.. `ఉగ్రం` 2 డేస్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇవే!

టాలీవుడ్ హీరో అల్ల‌రి న‌రేష్ తాజాగా `ఉగ్రం` అనే మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. విజయ్ కనకమేడల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో మ‌ల‌యాళ ముద్దుగుమ్మ మిర్నా మీనన్ హీరోయిన్ గా న‌టిస్తే.. ఇంద్రజ, శరత్ లోహితాశ్వ, శత్రు, శ్రీనివాస్ సాయి, బేబీ ఊహ తదితరులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

షైన్ స్క్రీన్ బ్యానర్ బ్యాన‌ర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచ‌నాల మే 5న విడుద‌లైన ఈ చిత్రానికి మిక్స్డ్‌ టాక్ ల‌భించింది. దీంతో ఈ చిత్రం ఊహించిన స్థాయిలో వ‌సూళ్ల‌ను రాబ‌ట్ట‌లేక‌పోయింది. కానీ, రెండో రోజు అల్ల‌రోడు బాక్సాఫీస్ వ‌ద్ద జోరు పెంచాడు.

తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 61 ల‌క్ష‌ల రేంజ్ లో షేర్‌ను రాబ‌ట్టిన ఉగ్రం.. రెండో రోజు రూ. 67 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. అలాగే వ‌ర‌ల్డ్ వైడ్ గా రెండు రోజుల్లో రూ. 1.48 కోట్ల షేర్‌ను రాబ‌ట్టింది. ఇక ఏరియాల వారీగా ఉగ్రం 2 డేస్‌ టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ను ఓసారి గ‌మ‌నిస్తే..

నిజాం: 51ల‌క్ష‌లు
సీడెడ్: 21 ల‌క్ష‌లు
ఉత్త‌రాంధ్ర‌: 15 ల‌క్ష‌లు
తూర్పు: 10 ల‌క్ష‌లు
పశ్చిమ: 6 ల‌క్ష‌లు
గుంటూరు: 10 ల‌క్ష‌లు
కృష్ణ: 9 ల‌క్ష‌లు
నెల్లూరు: 6 ల‌క్ష‌లు
———————————————
ఏపీ+తెలంగాణ మొత్తం= 1.28 కోట్లు(2.41కోట్లు~ గ్రాస్‌)
———————————————

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా+ఓవ‌ర్సీస్‌: 21 ల‌క్ష‌లు
————————————————–
మొత్తం వ‌ర‌ల్డ్ వైడ్‌ కలెక్షన్‌= 1.48 కోట్లు(2.91 కోట్లు~ గ్రాస్)
————————————————–

కాగా, రూ. 6.50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఉగ్రం.. బాక్సాఫీస్ వ‌ద్ద క్లీన్ హిట్ గా నిల‌వాలంటే మొద‌టి రెండు రోజులు వ‌చ్చిన వ‌సూళ్లు కాకుండా ఇంకా రూ. 5.02 కోట్ల షేర్‌ను అందుకోవాల్సి ఉంటుంది.