ఖాళీ టైమ్ దొరికితే అదే ప‌ని.. వామ్మో రెజీనా ఇంత రొమాంటిక్కా?

రెజీనా కాసాండ్రా.. కెరీర్ ఆరంభంలో ఈ బ్యూటీ దూకుడు చూసి టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ల లిస్ట్ లో చేరుతుంద‌ని అంద‌రూ భావించారు. కానీ, అలా జ‌ర‌గ‌లేదు. ఆక‌ట్టుకునే అందం, అంత‌కు మించిన న‌ట‌నా ప్ర‌తిభ ఉన్నాస‌రే రెజీనాకు ఆఫ‌ర్లు అంతంత మాత్రంగానే మారాయి. అడ‌పా త‌డ‌పా సినిమాలు, వెబ్ సిరీస్ ల‌తో కెరీర్ ను నెట్టుకొస్తోంది.

ప్ర‌స్తుతం ‘జాన్‌బాజ్‌ హిందుస్థాన్‌ కే’ వెబ్‌ సిరీస్ ప్ర‌మోష‌న్స్ లో రెజీనా బిజీగా ఉంది. ఈ వెబ్ సిరీస్ లో రెజీనా కావ్య అయ్యర్‌ అనే ఐపీఎస్‌ ఆఫీసర్‌ పాత్రలో న‌టించింది. ఇందులో భాగంగానే ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న రెజీనా.. వృత్తిప‌ర‌మైన విష‌యాలే కాకుండా వ్య‌క్తిగత విష‌యాల‌ను సైతం పంచుకుంది. టీనేజ్‌లో ఉండగా సినిమాల్లోకి వచ్చాన‌ని.. అప్పట్లో అక్కడి పరిస్థితులేం అర్థమయ్యేవి కావ‌ని, రోజులు గడిచేకొద్దీ సినిమా ప్రపంచం అర్థమైంద‌ని రెజీనా చెప్పుకొచ్చింది.

ఫ్రెండ్స్‌తో చిట్‌చాట్‌, స్కై డైవింగ్‌ అంటే త‌న‌కు ఇష్టమ‌ని, ఏఆర్‌ రెహమాన్‌ పాటలు బాగా వింటాన‌ని రెజీనా తెలిపింది. తాను కాఫీ ల‌వ‌ర్ అని ఈ సంద‌ర్భంగా రెజీనా పేర్కొంది. సైకాలజీలో డిగ్రీ చదవ‌డం వ‌ల్ల‌నో ఏమో కానీ.. మనుషులతో ఓ పట్టాన కనెక్ట్‌ కాలేన‌ని, ఒకరి మీద ఆధారపడటం, ఒకరికి ఆధారంగా నిలబడటం త‌న‌కు న‌చ్చ‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది. అంతేకాదు, ఖాళీ టైమ్ దొరికితే రొమాంటిక్‌ నవలలు చద‌వ‌డం త‌న‌కు బాగా అల‌వాటు అని రెజీనా త‌న సీక్రెట్ ను రివీల్ చేసింది. దీంతో రెజీనా ఇంత రొమాంటిక్కా అంటూ నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.

Share post:

Latest