సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో తరచూ ఏవో ఒక రూమర్లు నటీనటుల మధ్య వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫేక్ న్యూస్ కూడా చాలా వైరల్ గా మారుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో పలువురు సినీ సెలబ్రెటీల పైన తప్పుడు వార్తలు బాగా ప్రచారం చేస్తున్నారు. కానీ కొన్ని మీడియా సంస్థలు వెబ్సైట్లో అత్యుత్సాహంతో ఆరోగ్యంగా ఉన్న వారిని కూడా తమ వార్తలతో చంపేస్తున్నారు. దీంతో సదరు సినీ ప్రముఖులు సైతం లైవ్ లోకి వచ్చి మేము బతికే ఉన్నామని చెప్పే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ఇప్పుడు అలాంటి వార్త లు సీనియర్ నటుడు సుధాకర్ మీద కూడా ఇలాంటి ఫేక్ న్యూస్ వైరల్ గా మారుతోంది. టాలీవుడ్లో సీనియర్ కమెడియన్ గా ఉన్న సుధాకర్ మృతి చెందాడంటూ గత కొద్దిరోజులుగా ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. దీంతో కొన్ని మీడియా సంస్థలు కూడా ఈ విషయాన్ని క్యారీ చేశాయి.. ఈ నేపథ్యంలోనే ఇలాంటి వార్తలను ఖండిస్తూ సుధాకర్ ఒక మీడియాతో మాట్లాడారు.. తాను ఆరోగ్యంగానే ఉండాలని చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు.
దయచేసి ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ఎవరు కూడా ప్రచారం చేయవద్దని నమస్కారం తో అందరిని కోరుకుంటున్నారు. నా మీద వచ్చిన వారిని ఫేక్ న్యూస్ తప్పుడు వార్తలను రాయకండి నేను చాలా సంతోషంగా ఉన్నాను ఐ యాం వెరీ హ్యాపీ అండ్ సుధాకర్ వీడియో ద్వారా తెలియజేశారు.. దీంతో సుధాకర్ పై ఇలాంటి నకిలీ వార్తలను ప్రచారం చేయడంతో సినీ అభిమానులు ఆయన ఫ్యాన్స్ సైతం మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ ఈ విషయం వైరల్ గా మారుతోంది.<
/p>