చిరంజీవి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఏకైక సినిమా ఏదో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి తన సినీ కెరీర్లో 150 కి పైగా చిత్రాల్లో నటించారు. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హోదాను అందుకున్నారు. కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ గుర్తుండిపోయేలా ముద్ర వేసుకున్నారు. ఆరు ప‌దుల వ‌య‌సులోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు ఇప్ప‌టికీ గ‌ట్టి పోటీ ఇస్తున్నారు.

ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. గతంలో చిరంజీవి మెగా ఫోన్ ప‌ట్టారన్న సంగతి మీకు తెలుసా..? అవును చిరంజీవి దర్శకత్వంలో ఓ సినిమా వచ్చింది. ఇంతకీ ఆ మూవీ మరేదో కాదు `బిగ్ బాస్`. అయితే ఈ సినిమా మొత్తానికి అయినా దర్శకత్వం వహించలేదు. కేవ‌లం కొన్ని సన్నివేశాలను చిరంజీవినే డైరెక్ట్ చేశారు. విజయ బాపినీడు డైరెక్ట‌ర్ లో చిరంజీవి, రోజా జంట‌గా తెర‌కెక్కిన మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ ఇది.

ఇందులో కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, మాధవి, విజయచందర్ తదిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై ఈ మూవీని నిర్మించారు. అయితే ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో ఓ రోజు దర్శకుడు విజయబాపినీడు త‌న స్నేహితుడు హెల్త్ బాగోలేదని బయటకి వెళ్ళార‌ట‌. అయితే చిరంజీవి అదే రోజు కాల్ షీట్స్ ఇచ్చి ఉన్నార‌ట‌. ఈ రోజు మిస్ అయితే.. మళ్ళీ టైమ్ కేటాయించ‌డానికి క‌ష్టం అని భావించిన చిరంజీవి ఆ రోజు చేయాల్సిన సన్నివేశాలు డైరెక్టర్ చైర్ లో ఉండి తీశార‌ట‌. ఆ రోజు ఓ ఫైట్ సీన్ తో పాటు ప‌లు స‌న్నివేశాల‌ను చిరంజీవి స్వ‌యంగా డైరెక్ట్ చేశార‌ట‌. అలా చిరంజీవి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఏకైక సినిమా బిగ్ బాస్ అయింది.

Share post:

Latest