నిత్యానంద స్వామి వల్ల స్టార్ హీరో కుటుంబం నాశనం..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో గురువును మించిన శిష్యులు, బుద్ధిమంతులు వంటి సినిమాలలో నటించి మంచి పేరు సంపాదించారు సీనియర్ నటుడు అశోక్ కుమార్.. అయితే ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి తనకు నచ్చని వివాహాన్ని చేసుకుని ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. ఆ తర్వాత తన భార్యను అక్కున చేర్చుకొని పిల్లలతో చాలా సంతోషంగా ఉన్న సమయంలో తమ పిల్లలు చేసిన పని వల్ల చాలా తలవొంపులు వచ్చాయని భాగోద్వేగానికి లోనవుతున్నారు.

Senior Actor Ashok Kumar Says His Daughters Are With Swami Nithyananda -  Sakshi

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అశోక్ కుమార్.. మొదట పోలీస్ ఆఫీసర్గా పనిచేశాను.. ఆ తర్వాత ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి హైదరాబాదులో ఒక హోటల్ నడిపాను అందులో కూడా చాలా నష్టం వచ్చింది. ఏం చేయాలో తెలియక మద్రాసుకి వెళ్లి విలన్ గా సహాయ నటుడిగా పలు సినిమాలలో చేశాను. రామానాయుడు గారు నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తానని చెప్పారని తెలిపారు. కాని చివరకు అక్కినేని నాగేశ్వరరావు గారు ఇచ్చిన సలహా వల్ల తనని తీసేసి జగ్గయ్యను హీరోగా చేశారట. ఇలా కొన్ని సంఘటనల వల్ల తన ఆత్మ అభిమానం దెబ్బతినిందని దీంతో సినీ ఇండస్ట్రీ నుంచి బయటికి వచ్చేసానని తెలిపారు.

ashok kumar interview actress ranjitha - nithyananda | நித்யானந்தாவுடன்  தொடர்பு எனது மனைவி மரணத்திற்கு ரஞ்சிதாவே காரணம் தந்தை உருக்கம்

ఇక తన కుటుంబం గురించి మాట్లాడుతూ… తన భార్యను చూడకుండానే వివాహం చేసుకున్నానని.. తన వల్ల ఆ అమ్మాయి బాధపడకూడదని తనతో పాటు మద్రాసుకి తీసుకు వచ్చాను.. అలా తమకు ముగ్గురు ఆడపిల్లలు జన్మించారని పెద్ద చదువులు కూడా చదివించానని ముగ్గురికి పెళ్లి చేశారని తెలిపారు.

కానీ ఇద్దరమ్మాయిలు విడాకులు తీసుకున్నారని రెండవ అమ్మాయి రంజిత స్వామినిత్యానందతో వివాహం జరిగిందని వార్తలు వచ్చాయి.. కానీ అందులో ఎంత నిజం ఉందో తెలియదు వారిద్దరు క్లోజ్ గా ఉన్న ఫోటోలు అయితే బయట కనిపించాయి. నిత్యానంద వల్లే ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తికి కూడా విడాకులు ఇచ్చిందని తెలిపారు. కోపంతో ఒకసారి నిత్యానంద దగ్గరకు వెళ్లి సిగ్గు లేదా అంటూ తన కూతుర్ని నీ ఆశ్రమం నుంచి వెనక్కి పంపించమని అడిగాను.. అసలు అక్కడ పట్టించుకునే వారే లేరు.. నిత్యానందమాయలో పడి తన ఇద్దరు కూతుర్లు అతడి వెంటే వెళ్లిపోయారు. ఇప్పటికీ అతనితోనే ఉన్నారంటూ తెలిపారు. ఈ బాధ భరించలేక తన భార్య మరణించిందని తన మూడో కూతురు తనను చూసుకుంటుందని తెలిపారు అశోక్ కుమార్.

Share post:

Latest