జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. కరోనా కాలం తరువాత నుండి ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి టాలీవుడ్లో ఎంతోమంది సినీ సెలబ్రిటీల జాతకాలు చెప్తూ, ఒక సెలబ్రిటీ కంటే ఎక్కువగా పేరుని సంపాదించుకున్నాడు. దాంతో సెలబ్రిటీ మారిపోయాడు జ్యోతిష్యుడు అయిన వేణు స్వామి. ఇప్పటికే ఈయన చెప్పిన జ్యోతిష్యం నూటికి తొంబై శాతం కొందరు తారల విషయంలో జరగడంతో చాలామంది ఈయన దగ్గరికి జాతకాలు చెప్పించుకొని పరిహార పూజలు కూడా చేయించుకుంటున్నారు.
ఈ క్రమంలోనే హీరోయిన్ నిధి అగర్వాల్, రష్మిక మందన్న వంటి హీరోయిన్లు సైతం ఆయనను ఆశ్రయించి పూజలు కూడా చేయించుకున్న పరిస్థితి. ఇక వీరే కాకుండా చాలా మంది హీరోలు, హీరోయిన్లు కూడా ఈయన దగ్గర పూజలు చేయించుకున్నారు. అయిదు వారి ఫోటోలు మాత్రం బయటకు రాకపోవడం కొసమెరుపు. ఇక వేణు స్వామి సమంత – నాగచైతన్య విడిపోతారు అని ముందుగానే చెప్పడం కావచ్చు, అలాగే రష్మిక తన పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంటుందని చెప్పడం కావచ్చు, బాహుబలి తరువాత ప్రభాస్ సినిమాలు ఆడకపోవడం గురించి కావచ్చు…. వేణుస్వామి చెప్పిన విషయాలు జరగడంతో ఆయన జాతకాలకి మంచి మైలేజీ వచ్చింది.
ఇక అసలు విషయంలోకి వెళితే, తాజాగా మరొక తెలుగు యాంకర్ విషయంలో వేణు స్వామి చెప్పిందే నిజమవుతుంది అంటూ కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆ యాంకర్ ఎవరో కాదు ‘యాంకర్ వర్షిణి.’ వర్షిణి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఢీ జోడి లో ఆదితో కలిసి ఈమె చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇక ఈ ముద్దుగుమ్మ పేరు ఈ మధ్యకాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ఈ మధ్యలోనే తాజాగా వర్షిణి గురించి ఒక వార్త వినిపిస్తోంది. అదేంటంటే.. యాంకర్ వర్షిణి క్రికెటర్ అయిన వాషింగ్టన్ సుందర్ తో ప్రేమలో ఉందని. ఇక వీరిద్దరి ప్రేమ నిజం అయితే యాంకర్ వర్షిణి ఇండియాలోనే చాలా ఫేమస్ అవుతుంది. దాంతో వేణు స్వామి చెప్పిందే నిజమవబోతుందని అందరూ గుసగుసలు ఆడుకుంటున్నారు.