అయ్య బాబోయ్‌.. ర‌వితేజ `టైగ‌ర్‌` కోసం అన్ని కోట్లు ఖ‌ర్చు పెడుతున్నారా?

మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం `టైగర్ నాగేశ్వరరావు` మూవీతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. వంశీకృష్ణ నాయుడు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ అగర్వాల్ నిర్మిస్తున్నారు. నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇందులో ఓ కీల‌క పాత్ర‌ను పోషించింది.

1970ల కాలం నాటి టైగర్ జోన్ గా పేరుగాంచిన స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బ‌యోపిక్ ఇది. లైఫ్ స్టొరీతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. శ‌ర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్ 20న తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది.

ర‌వితేజ న‌టిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇది. పైగా మాస్ రాజా కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం రూ. 50 కోట్లు ఖ‌ర్చు పెడుతున్నార‌ట నిర్మాత‌లు. ఈ విషంలోనూ రాజీ ప‌డ‌కుండా టైగర్ నాగేశ్వరరావును రూపొందిస్తున్నార‌ట‌. మ‌రి `రావ‌ణాసుర‌` మూవీతో ఫ్లాప్‌ను మూట‌గ‌ట్టుకున్న ర‌వితేజ‌.. ఈ సినిమాతో మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్ ఎక్కుతాడా..లేదా.. అన్న‌ది చూడాలి.