మళ్లీ పెళ్లి సినిమా రిలీజ్ కి ముందే బిగ్ షాక్.. ఏం జరిగిందంటే..?

సీనియర్ నటుడు వీకే నరేష్. నటి పవిత్ర లోకేష్ జంటగా కలిసి నటిస్తున్న చిత్రం మళ్ళీ పెళ్లి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించారు. నరేష్, పవిత్ర లోకేష్ నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు వార్తలు వినిపించాయి. గత కొద్ది రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నరేష్, పవిత్ర లోకేష్ పలు ఆసక్తికరమైన విషయాలను సైతం తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా ఆగిపోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి తెలుసుకుందాం.

Malli Pelli (2023) - Movie | Reviews, Cast & Release Date in hyderabad-  BookMyShow
మళ్లీ పెళ్లి సినిమాకు సంబంధించి ఇప్పటివరకు విడుదలైన టీజర్, సాంగ్స్ ,ట్రైలర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. రేపటి రోజున ఈ సినిమా చాలా గ్రాండ్ గా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంలోనే ఈ సినిమాను నిలిపివేయాలంటూ కోర్టును ఆశ్రయించింది నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి.. ఈ మేరకు ఆమె కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టుల ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తన ప్రతిష్టను కించపరిచేలా ఈ చిత్రంలో పలు సన్నివేశాలు ఉన్నాయంటూ కూడా ఆమె ఆరోపణలు చేస్తోంది.

Comments Section Is More Entertaining Than The Trailer Itself!
దీంతో ఈ సినిమాని ఆపాలంటూ కోర్టును ఆశ్రయించడంతో నరేష్, పవిత్ర లోకేష్ కు ఈ సినిమా విడుదల సమయంలో ఒక బిగ్ షాక్ తగిలిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి నరేష్ కు డబ్బులు ఎక్కువై ముచ్చట తీర్చుకుంటున్నారు. తప్ప ఈ సినిమాని ఎవరు పట్టించుకోరు అని వార్తలు కూడా వినిపించాయి. కానీ ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి అప్డేట్ కూడా ఈ సినిమా క్యూరియాసిటీ విపరీతంగా పెంచేసాయి. మరి ఏ మేరకు ఈ సినిమా రేపటి రోజున విడుదలవుతుందో చూడాలి మరి.

Share post:

Latest