కొత్త బ్యాన‌ర్ ప్రారంభిస్తున్న రామ్ చ‌ర‌ణ్‌.. ఫ‌స్ట్ మూవీ ఆ హీరోతోనే అట‌!?

గ్లోబ‌ల్‌ స్టార్ రామ్ చరణ్ ఓవైపు హీరోగా వరుస సినిమాలతో దూసుకుపోతూనే.. మరోవైపు కొణిదెల‌ ప్రొడక్షన్స్ బ్యానర్ పై చిరంజీవి హీరోగా ప‌లు సినిమాలను నిర్మిస్తూ స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ గా సత్తా చాటుతున్నాడు. అయితే ఆల్రెడీ ఒక సొంత బ్యానర్ కలిగి ఉన్న రామ్ చరణ్.. ఇప్పుడు మరో కొత్త బ్యాడర్ ను ప్రారంభించబోతున్నాడట.

యూవీ క్రియేషన్స్ బ్యానర్లో సహ నిర్మాతగా వ్యవహరిస్తోన్న త‌న స్నేహితుడు విక్రమ్ తో క‌లిసి `వి మెగా పిక్చ‌ర్స్‌(V Mega Pictures)` అనే పేరుతో ప్రొడక్షన్ హౌస్ ను స్టార్ట్ చేయ‌బోతున్నాడ‌ట‌. తెలుగు రాష్ట్రాల్లోని కొత్త టాలెంట్ ను వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగానే రామ్ చ‌ర‌ణ్ ఈ ప్రొడెక్ష‌న్ హౌస్ ను ప్రారంభించ‌బోతున్నాడ‌ట‌. అలాగే త‌న తోటి హీరోల సినిమాల‌ను కూడా ఈ బ్యాన‌ర్ పై నిర్మించ‌నున్నార‌ట‌.

ఇందులో భాగంగానే ఈ కొత్త బ్యాన‌ర్ లో ఫ‌స్ట్ మూవీని అఖిల్ అక్కినేనితో ప్లాన్ చేస్తున్న‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. డైరెక్ట‌ర్ ఎవ‌రు, ఏమిటి అన్న వివ‌రాలు త్వ‌ర‌లోనే బ‌య‌ట‌కు రానున్న‌ట్లు స‌మాచారం. కాగా, అఖిల్ రీసెంట్ గా `ఏజెంట్‌` మూవీతో అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నాడు. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఆ స్పై యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ బాక్సాఫీస్ వ‌ద్ద బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ గా మిగిలింది.

Share post:

Latest