మొదట విలన్ రోల్స్ చేసి తరువాత హీరోగా సక్సెస్ అయిన వాళ్ళు వీరే!

ఏ సినిమా పరిశ్రమను తీసుకున్నా మొదట విలన్ రోల్స్ చేసి తరువాత హీరోగా సక్సెస్ అయిన వాళ్ళ లిస్టు చూస్తే అందులో దాదాపు సూపర్ స్టార్లే మనకు తారసపడతారు. ఇక్కడ తెలుగులో మీ ఫెవరేట్ హీరో ఎవరు అని అడిగితే దాదాపుగా 99 శాతం చెప్పే పేరు మెగాస్టార్ చిరంజీవి. ఎవరి సపోర్ట్ లేకుండా స్వయంకృషితో పైకి వచ్చిన మెగాస్టార్ కెరీర్ మొదట్లో అనేక సినిమాలలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించి మెప్పించాడు. ఇక ఆ తరువాతనే చిరంజీవికి హీరో పాత్రలు రావడం మొదలు పెట్టాయి. అదేవిధంగా ఇక్కడ గుక్కతిప్పుకోకుండా డైలాగులు చెప్పడంలో మోహన్ బాబు మంచి నేర్పరి. ఈయన కూడా మొదట్లో విలన్ మరియు సపోర్టింగ్ రోల్స్ చేసి తరువాత కలెక్షన్ కింగ్ అయ్యారు మోహన్ బాబు.

ఇక యావత్ భారతీయ చలన చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా ఎదిగి కోట్లాది మంది ప్రజలను తన అభిమానులుగా చేసుకున్న రజినీకాంత్ కెరీర్ మొదట్లో అనేక కన్నడ సినిమాలలో విలన్ రోల్స్ చేసిన విషయం తెలిసినదే. అంతేకాకుండా రాజశేఖర్ అతి తక్కువ టైంలోనే యాంగ్రీ యంగ్‌ మ్యాన్‌గా గుర్తింపు పొందాడు. కెరీర్ మొదట్లో ‘తలంబ్రాలు’ వంటి సినిమాలో విలన్ గా మెప్పించిన ఆ తరువాత నుండి హీరోగా కొనసాగుతూ.. ప్రస్తుతం వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుంటూ సక్సెస్ అవుతున్నాడు.

ఇక ఈ తరానికి వస్తే, గోపీచంద్ మొదటగా ‘తొలివలపు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ హీరోగా ఆశించినంత సక్సెస్ కాకపోవడంతో.. యూ టర్న్ తీసుకుని ప్రతినాయకుడి పాత్రలవైపు మళ్లాడు. అలా తేజ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘జయం’ ద్వారా విలన్ అవతారం ఎత్తి ‘వర్షం’, ‘నిజం’ సినిమాలలో ప్రభాస్, మహేష్ బాబులకు ఎదురుగా విలన్ రోల్స్ చేసి క్రిటిక్స్ ని సైతం మెప్పించాడు. ఇక ఆ తరువాతి నుండి హీరోగానే కొనసాగుతున్నాడు గోపీచంద్. అంతెందుకు ఇండియన్ మెగాస్టార్ బాలీవుడ్ నటుడు అమితాబ్ కూడా మొదట్లో విలన్స్ రోల్స్ చేసినట్టు విదితమే.