`విరూపాక్ష`లో విలన్‌ను మార్చేసిన సుకుమార్.. సినిమా హిట్ అయ్యాక ఇదేం ట్విస్ట్ రా బాబు!

బైక్ యాక్సిడెంట్ తర్వాత మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ `విరూపాక్ష` మూవీ తో రీసెంట్ గా అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కార్తీక్‌ వర్మ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంయుక్త మీన‌న్‌ హీరోయిన్ గా నటిస్తే.. బ్రహ్మాజీ, సాయి చంద్, శ్యామల, రాజీవ్ కనకాల, సునీల్ తదితరలు కీలక పాత్రల‌ను పోషించారు.

బీఎస్‌ఎన్‌ ప్రసాద్‌, సుకుమార్ సంయుక్త నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఈ మిస్టరీ థ్రిల్ల‌ర్ ఏప్రిల్ 21న విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి దుమ్ము దులిపేసింది. ఇటీవ‌లె ఈ మూవీ ఓటీటీలోకి కూడా వచ్చింది. అయితే సినిమా హిట్ అయిపోయాక డైరెక్టర్ కార్తీక్ వర్మ బిగ్ ట్విస్ట్‌ ఇచ్చాడు.

విరూపాక్ష సినిమాలో క్లైమాక్స్ లో హీరోయిన్ సంయుక్తనే విలన్ అని తెలియగానే ప్రేక్షకులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఈ ట్విస్ట్ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడానికి ప్రధాన కారణం గా నిలిచింది. కానీ, నిజానికి సినిమాలో మొద‌ట అనుకున్న విల‌న్ సంయుక్త కాద‌ట‌. డైరెక్ట‌ర్ కార్తీక వ‌ర్మ తొలిత క‌థ రాసుకున్న‌ప్పుడు శ్యామల పోషించిన పార్వతి పాత్ర మెయిన్ విలన్ గా అనుకున్నాడ‌ట‌. అయితే సుకుమార్ కు క‌థ వినిపించ‌గా.. ఆయ‌న స్క్రీన్ ప్లే చేంజ్ చేయడంతో పాటు విల‌న్ కూడా మార్చేశాడ‌ట‌. విలన్ మరింత స్ట్రాంగ్ గా ఉంటే బాగుంటుందని చెప్పిన‌ హీరోయిన్ సంయుక్త‌ పాత్రను విలన్ చేసేశారు. అద‌న్న‌మాట సంగ‌తి. ఒక‌వేళ శ్యామ‌ల పాత్ర‌నే ఇందులో విల‌న్ అయ్యుంటే.. విరూపాక్ష రిజ‌ల్ట్ ఎలా ఉండేదో మ‌రి.

Share post:

Latest